మున్సిపల్ కమిషనర్ కు కాలనీవాసుల మొర
నవతెలంగాణ – జోగులాంబ గద్వాల
కాలనీలో ఇళ్ల మధ్య, రోడ్డుపై మురుగునీరు చేరి దుర్గంధం వెదజల్లుతుందని దీంతో ప్రజలు అనారోగ్యాల బారిన పడే ప్రమాదం ఉందని 4వ వార్డు కాలనీ ప్రజలు మున్సిపల్ కమిషనర్ కు మొరపెట్టుకున్నారు. గద్వాల మున్సిపాలిటి జమ్మిచేడు 4వ వార్డులో మురుగు (డ్రిసీజి)కాలువ లేనందున మురుగు నీళ్ళు రోడ్డుపై నిలిచిపోయి బురదగామారి దుర్వాస వస్తూ, నడవడానికి వీలులేనంతగా మారింది.
ఇండ్ల నుండి వచ్చు వ్యర్ధపు నీళ్లు, వర్షపు నీళ్లు రోడ్డుపైన ప్రవహించి, నిలిచిపోయి దుర్వాసన వస్తూ నడవడానికి రావడం లేదు. వాహనదారులు ఆనేకసార్లు క్రిందపడిన సందర్భాలు వున్నాయి. పందులు తిరుగడంవల్ల రాత్రివేళలో దోమలు, ఈగల బెడద ఎక్కువై చిన్నపిల్లలకు చంటిపిల్లలకు, వృద్ధులు అనారోగ్యాల బారిన పడుతున్నారు. సమస్యను గుర్తించి తక్షణమే వార్డులో డ్రైనేజీ (మురుగుకాలువ) నిర్మాణంచేసి, నీళ్లు ముందుకు సాగిపోయేటట్లు చేసి న్యాయం చేయాలని కోరారు.



