మున్సిపల్ కమిషనర్ సుష్మ
నవతెలంగాణ – పరకాల
పట్టణంలో పారిశుధ్య నిర్వహణ పట్ల అశ్రద్ధ చేస్తే సహించేది లేదని మున్సిపల్ కమిషనర్ కొడారి సుష్మ అన్నారు. బుధవారం ఉదయం సుమారు 5 గంటల ప్రాంతంలో పారిశుధ్య నిర్వహణ పనుల నిర్వహణ విధానంపై కమిషనర్ ఆకస్మికంగా తనిఖీ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా కమిషనర్ హాజరు రిజిస్టర్ను పరిశీలించి విధులకు హాజరు కాని ఇద్దరు ఉద్యోగులకు(వెహికల్ డ్రైవర్స్) ఆబ్సెంట్ వేశారు. అలాగే వార్డులలోని లోతట్టు ప్రాంతాలను పరిశీలించి నీటి నిలువలు లేకుండా చేయాలని పలు సూచనలు చేయడం జరిగింది. డంపింగ్ యార్డ్ సందర్శించి చెత్త సేకరణ వాహనా రాకపోకలకు ఏర్పడే అంతరాయాన్ని పరిశీలించారు. ఉన్నత అధికారులతో మాట్లాడి డంపింగ్ యార్డ్ రోడ్డు నిర్మాణానికి కృషి చేయనున్నట్లు తెలిపారు. వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున మున్సిపల్ జవాన్లు పాశుద్ధ్య నిర్వహణ పట్ల అశ్రద్ధ చేయకుండా ఎప్పటికప్పుడు చెప్ప సేకరణ చేపట్టాలని కమిషనర్ సూచించారు. ఈ కార్యక్రమంలో ఆమెతోపాటు జవాన్లు ,మున్సిపల్ సిబ్బంది తదితరులు ఉన్నారు.
పారిశుద్ధ్య నిర్వహణ పట్ల నిర్లక్ష్యం చేయొద్దు..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES