నవతెలంగాణ – మద్నూర్
మద్నూర్ మండలంలోని మేనూర్ గ్రామంలోని సబ్స్టేషన్ ఆవరణంలో శుక్రవారం ఉదయం 10:30 గంటల నుండి మధ్యాహ్నం ఒంటిగంట వరకు విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కార వేదిక సి జి ఆర్ ఎఫ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సమస్యల పరిష్కార వేదిక లో విద్యుత్ వినియోగదారులు ఉన్నత అధికారుల దృష్టికి పలు సమస్యలు తీసుకువచ్చారు. సమస్యల పరిష్కార వేదిక ఉన్నట్లు ఏ ఒక్క అధికారి కూడా సమాచారం ఇవ్వలేదని, వినియోగదారులంతా అధికారుల తీరుపై అగ్రహం వ్యక్తం చేశారు. వినియోగదారుల విన్నపాన్ని స్పందిస్తూ సిజిఆర్ఎఫ్ చైర్ పర్సన్ ఎరుకల నారాయణ ట్రాన్స్కో ఏ ఈ లకు వినియోగదారులు మీపై చేసిన ఆరోపణ నిజమేనా అని ప్రశ్నించారు. దీంతో వారు కూడా సరైన సమాధానం ఇవ్వకపోవడం ఇలాంటి వేదిక పెట్టిందే సమస్యల పరిష్కారం కోసం. అలాంటి సమాచారం ఎందుకు ఇవ్వలేదని చైర్ పర్సన్ అధికారుల పనితీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇలాంటి తప్పులు మరొక్కసారి జరగకుండా చూడాలని లేదంటే వినియోగదారులు సమాచారం ఇవ్వనట్లు తెలుపుతూ మాత్రం చర్యలు తప్పమని హెచ్చరించారు. వినియోగదారులకు చైర్ పర్సన్ ఒక సూచన చేశారు అది ఏమిటంటే ప్రతి సోమవారం ప్రతి ఏ ఈ ఉన్న సబ్ స్టేషన్ల పరిధిలో ప్రజా వేదిక జరపడం జరుగుతుందని, వినియోగదారులు తమ సమస్యలను ప్రజా వేదికలో జరుపుకోవాలని సూచించారు. ఈ నేపథ్యంలో వినియోగదారులు చైర్పర్సన్ తో మాట్లాడుతూ.. ప్రతి సోమవారం ట్రాన్స్కో ఏఈలచోట ప్రజా వేదిక కార్యక్రమాలు జరుగుతున్నట్లు ఇంతవరకు తెలియదని, అధికారులు ఎందుకు తెలపలేదని ప్రశ్నించారు. ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా వేదిక కార్యక్రమాలు ఎందుకు జరపడం లేదని, అధికారులు తీరుపై చైర్ పర్సన్ అగ్రం వ్యక్తం చేశారు. ప్రతి సోమవారం ప్రజా వేదిక ఉన్నట్లు పత్రికల పరంగా తెలియజేయాలని ఆదేశాలు జారీ చేశారు.
వినియోగదారుల సమస్యల పరిష్కారానికి నిర్ధారిత గరిష్ట కాల పరిమితి ప్రకారం సమస్యల పరిష్కారానికి కృషి చేయడం జరుగుతుందని, సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో వినియోగదారులు చేసిన ఫిర్యాదులపై సమస్యలు పరిష్కారం కావడానికి కృషి చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో సలంద్ర రామకృష్ణ మెంబర్ టెక్నికల్, లకావత్ కిషన్ మెంబర్ ఫైనాన్స్, మర్రిపల్లి రాజా గౌడ్ ఫోర్త్ మెంబర్, ఇంచార్జ్ డి ఈ విజయ సారధి, మద్నూర్ ఏ ఈ గోపికృష్ణ, మేనూర్ ఏఈ రమేష్, బిచ్కుంద సబ్ డివిజనల్ పరిధిలోని వివిధ సబ్ స్టేషన్ల ఏఈలు కరెంటు సిబ్బంది వినియోగదారులు పాల్గొన్నారు.
విధుల్లో నిర్లక్ష్యం వహించవద్దు: సిజిఆర్ఎఫ్ చైర్ పర్సన్ నారాయణ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES