నవతెలంగాణ-ధర్మసాగర్
క్షణికావేశంలో తన విలువైన జీవితాలను నాశనం చేసుకోవద్దని కాజీపేట ఏసిపి ప్రశాంత్ రెడ్డి అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని స్థానిక పోలీస్ స్టేషన్లో విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడారు. ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా భారతదేశంలోనే కుటుంబ వ్యవస్థ ఉందని, నేటి సమాజం కుటుంబ వ్యవస్థకు చిన్న భిన్నం చేసే విధంగా క్షణికావేశంలో తమ విలువైన జీవితాలను నాశనం చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నిన్నటి గురువారం రోజున పెద్ద పెండ్యాల గ్రామానికి చెందిన రాజారపు అశోక్ (35) అతని భార్య యాదలక్ష్మి తరచూ కుటుంభ గొడవలతో విశ్కు చెందిన భార్య భర్తను హతమార్చిన ఘటన తెలిసిందే.
ఈ సందర్భంగా ఆమెను శుక్రవారం రాంపూర్ కపిల్ హోమ్స్ ప్రాంతంలో అరెస్టు చేసి, విచారించగా నిత్యం తాగుడు అలవాటు పడి పిల్లలను నన్ను పట్టించుకోకపోవడంతో ఆయన పెట్టే వేధింపులను భరించలేక క్షణికావేశంలో ఈ హత్య చేయడం జరిగిందని ఒప్పుకోవడం జరిగింది. దీంతో ఆమెను రిమాండ్ కు పంపడం జరిగిందన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ ఘటనలో వారికి చెందిన నలుగురు సంతానం కుమార్తెలు 12, 11 సంవత్సరాల కుమారులు 9, 7 సంవత్సరాల వయసుగల కుమారులు ఈ రోజున ఏ అండా లేక అనాధలుగా మారిన ఘటన చాలా బాధాకరమన్నారు. ప్రతి సమస్యకు పరిష్కార మార్గం అనేది తప్పకుండా ఉంటుందని, ఇలాంటి సంఘటనలు ఎదురైనప్పుడు కుటుంబ పెద్దలు అయినా తల్లిదండ్రులు, సమాలోచన చేసుకోవాలన్నారు. లేదా గ్రామ పెద్దలు సమక్షంలో నేటి పోలీసు వ్యవస్థ నాయన సంప్రదిస్తే సరియైన కౌన్సిలింగ్ లను ఇవ్వడం జరుగుతుందని సూచించారు.
ఇలాంటి సంఘటనలను పునరావృతం కాకుండా ప్రతి ఒక్కరు సరి అయిన చర్యలు తీసుకోవాలని హితువు పలికారు. ఈ సందర్భంగా మృతుడి తల్లిదండ్రులు వృద్ధాప్యంలో ఉండడం వలన, మరియు నేరస్థురాలు తరుపున ఎవరు బంధువులు లేకపోవడంతో, నేరస్థురాలు బెయిల్ పై వచ్చేంత వరకు మృతుడి/నేరస్థురాలి నలుగురు పిల్ల్లలని ధర్మసాగర్ పోలీస్ వారు ప్రభుత్వ సంస్థ అయినా CWC(చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ) హన్మకొండ గారికి అప్పగించనైనదనీ వివరించారు. కార్యక్రమంలో సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీధర్ రావు, ఎస్సైలు జాన్ పాషా, నరసింహారావు, పోలీసులు ఇతర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
క్షణికావేశంలో జీవితాలను నాశనం చేసుకోవద్దు: ఏసీపీ ప్రశాంత్ రెడ్డి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES