- Advertisement -
నవతెలంగాణ – మిర్యాలగూడ
స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా మంగళవారం కాంగ్రెస్ బలపరిచిన బెడ్దూరి వెంకటరెడ్డి ఇంటింటి ప్రచారంలో భాగంగా రెండో మూడు నాలుగు వార్డులలో ముమ్మరంగా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకటరెడ్డి మాట్లాడుతూ నన్ను గెలిపిస్తే గ్రామాభివృద్ధికి తోడ్పడుతానని గ్రామ అభివృద్ధిలో భాగస్వామ్యం అవుతానని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కంచుగంట్ల లింగయ్య యాదవ్ మండల నాయకులు సుధీర్ రెడ్డి, శేఖర్ రెడ్డి, బలరాం నాయక్ మచ్చ వెంకన్న, రెమడాల శ్రీనివాస్, సజ్జల అనంతరెడ్డి, కరుణాకర్ రెడ్డి, మచ్చ సైదులు, చెన్నారెడ్డి, విజయమ్మ, ధనలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



