నవతెలంగాణ – జన్నారం
మండలంలోని బీ మురిమడుగు గ్రామంలో శుక్రవారం ఫైలేరియా (బోధకాలు) TAS-1(Transmissian Assessment Survey -1) డాక్టర్ ఉమాశ్రీ జన్నారం వైద్యాధికారి ఆధ్వర్యంలో ఇంటింటికి సర్వే నిర్వహించారు. సందర్భంగా డాక్టర్ ఉమా శ్రీ మాట్లాడుతూ.. ప్రజలు బోదకాల వ్యాధిపై అప్రమత్తంగా ఉండాలన్నారు. సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉంటూ, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. ఇళ్ల చుట్టూ మురుగునీరు చేరకుండా చూసుకోవాలన్నారు. మురుగునీరు చేరడం వల్ల ఈగలు దోమలు వాలి మలేరియా డెంగ్యూ లాంటి ప్రాణాంతకరమైన వ్యాధులు ప్రభలే అవకాశం ఉందన్నారు. వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి ,T. పోచయ్య గారు(హెల్త్ అసిస్టెంట్ M), రాంబాబు , లక్ష్మి సూపర్వైజర్, డాక్టర్ గంగాదేవి గారు,MLHP విశ్వాస్ , సులోచన ANM ,K.కమలాకర్ ,మరియు ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.
బోదకాల వ్యాధిపై ఇంటింటికి సర్వే
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES