నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
భువనగిరి జిల్లా కేంద్రంలో సింగన్నగూడెంలో గల డబల్ బెడ్ రూమ్ ఇండ్లను లబ్ధిదారులతో కలిసి బిఆర్ఎస్ పార్టీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో పరిశీలించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ గత బిఆర్ఎస్ ప్రభుత్వం డ్రా ద్వారా ఎంపిక చేసిన 444 మంది లబ్ధిదారులకు వెంటనే ఇండ్లను అందించాలని, స్థానిక ఎమ్మెల్యే పర్యటించి గతంలో ఎంపిక చేసిన లబ్ధిదారులలో కూడా మార్పులు చేర్పులు ఉంటాయని చెప్పారని ఆరోపించారు.
ఏ ఒక్క లబ్ధిదారున్ని మార్చిన రానున్న రోజుల్లో అఖిలపక్షాన్ని ఏర్పాటు చేసి పోరాటం చేస్తామని హెచ్చరించారు. నాణ్యతలేని పనులను చేస్తున్నారని వారం రోజుల క్రితం నిర్మించిన డ్రైనేజీ కూలిపోయి కనిపిస్తున్నాయి కావున నాణ్యతతో పనులు చేయాలని కోరారు. అనంతరం కలెక్టరేట్ లో అడిషనల్ కలెక్టర్ కి వినతి పత్రం అందజేశారు.
ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ ఎన్నబోయిన ఆంజనేయులు, టిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు ఏవి కిరణ్ కుమార్, బిఆర్ఎస్ పార్టీ పట్టణ ప్రధాన కార్యదర్శి రచ్చ శ్రీనివాస్ రెడ్డి , సీనియర్ నాయకులు ఇట్టబోయిన గోపాల్ , పెంట నరసింహ, కాజా అజిముద్దీన్, తుమ్మల పాండు, తాడం రాజశేఖర్, తాడూరు బిక్షపతి, వెల్దుర్తి రఘునందన్, బర్రె రమేష్, ఎన్నబోయిన జాంగిర్, కొలుపుల నాగరాజ్, రహీం, ఇస్మాయిల్, ముజీబ్, అంజద్, పెంట నితీష్, నాగారం సూరజ్, యాస సంతోష్, సైదులు, ఇండ్ల శ్రీను, చిన్న, బురానుద్దీన్, మనీష్, స్వామి పాల్గొన్నారు.