నవతెలంగాణ – భువనగిరి
పట్టణంలోని సింగన్నగూడెం లో గల డబల్ బెడ్ రూమ్ ఇండ్లను లబ్ధిదారులకు వెంటనే కేటాయించాలని బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు ఎవి కిరణ్ కుమార్ డిమాండ్ చేశారు. సోమవారం బి ఆర్ ఎస్ పార్టీ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో డబల్ బెడ్ రూమ్ ఇండ్లను లబ్ధిదారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. స్థానిక ఎమ్మెల్యే పర్యటించి గతంలో ఎంపిక చేసిన లబ్ధిదారులలో మార్పులు చేర్పులు ఉంటాయని, కొన్ని మరొచ్చు అని మీడియా కి చెప్పడం జరిగిందన్నారు, అలా ఎలాంటి అవకతవకలు జరగకుండా గతంలో ఎంపిక చేసిన లబ్ధిదారులకు మాత్రమే కేటాయించాలన్నారు.
భువనగిరి పట్టణంలో ఇందిరమ్మ ఇండ్లలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏ విధంగా అయితే లబ్ధిదారుల వద్ద డబ్బులు తీసుకొని బిల్లులు ఇప్పిస్తామని చెప్పారు. ఇప్పుడు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను కాంగ్రెస్ పార్టీ నాయకులకు డబ్బులు వచ్చే విధంగా కొన్ని ఇళ్లను మార్పులు చేరు చేస్తామని ఎమ్మెల్యే మాటలు అలా అనిపిస్తున్నాయని విమర్శించారు. ,ఏ ఒక్క లబ్ధిదారున్ని మార్చిన రానున్న రోజుల్లో అఖిలపక్షాన్ని ఏర్పాటు చేసి పోరాటం చేస్తామని హెచ్చరించారు. నాణ్యతలేని పనులను చేస్తున్నారని వారం రోజుల క్రితం నిర్మించిన డ్రైనేజీ కూలిపోయి కనిపిస్తున్నాయన్నారు. నాణ్యతతో పనులు చేయాలని అక్కడ ఉన్న కాంట్రాక్టర్ యొక్క సూపర్వైజర్ కి తెలిపారు. అనంతరం కలెక్టరేట్ లో అడిషనల్ కలెక్టర్ గ వినతి పత్రం అందజేశారు పనులపై ప్రత్యేకమైన ఇంజనీర్లు ఏర్పాటు చేయాలని కోరారు.
డబల్ బెడ్ రూమ్స్ లబ్ధిదారులకు వెంటనే కేటాయించాలి: బీఆర్ఎస్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES