Wednesday, March 18, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మాదాపూర్ జిపి గ్రామాన్ని సందర్శించిన డీపీఓ మురళి

మాదాపూర్ జిపి గ్రామాన్ని సందర్శించిన డీపీఓ మురళి

- Advertisement -

నవతెలంగాణ-జుక్కల్: మండలంలోని మాదాపూర్ జీపీ గ్రామాన్ని కామారెడ్డి జిల్లా డీపీఓ మురళి గ్రామాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా గ్రామపంచాయతీలో నెలకొన్న సమస్యల గురించి గ్రామ సర్పంచ్ ఆశా రామచందర్ పటేల్ అడిగి తెలుసుకున్నారు. గ్రామ సర్పంచ్ ఆశా పటేల్ మాట్లాడుతూ నా జిపి గ్రామానికి కార్యదర్శి లేకపోవడంతో సమస్యలు తలెత్తుతున్నాయని అందువలన మా గ్రామానికి కొత్తగా గ్రామ కార్యదర్శిని వెంటనే అపాయింట్మెంట్ చేయాలని కోరుతూ గ్రామ సర్పంచ్, ఉపసర్పంచ్ మారుతి డిపిఓకు గ్రామస్తులతో కలిసి వినతి పత్రం అందించారు.అనంతరం డీపీఓ మురళి గ్రామంలోని అభివృద్ధి పనులను సందర్శించారు. గ్రామంలో బోరు ఒకటే ఉండటం వలన ఎండాకాలంలో అది వట్టిపోతుందని తెలిపారు. వెంటనే గ్రామానికి మరొక కొత్త బోరుబావికి నిధులు కేటాయించి మంజూరు ఇవ్వాలని, అదేవిధంగా బోరుబావి నుండి వాటర్ ట్యాంకు నూతనంగా పైప్ లైన్ చేయడం వలన శాశ్వతంగా గ్రామంనకు ఉన్న నీటి సమస్యను పరిష్కరించుకోగలుగుతామని తెలిపారు. వెంటనే కొత్త బోరు పైప్ లైన్ గురించి మంజూరు చేయాలని వినతిపత్రంలో పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ తో పాటు ఉపసర్పంచ్, గ్రామ పెద్దలు రాజు పటేల్ రామచందర్ పటేల్, అశోక్ పటేల్, సంతోష్, గంగారం, యువకులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -