Thursday, August 14, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్రోగుల హృదయాల్లో భరోసాగా డా. అంకం గణేష్

రోగుల హృదయాల్లో భరోసాగా డా. అంకం గణేష్

- Advertisement -

నవతెలంగాణ – కంఠేశ్వర్ : నిజామాబాద్ జిల్లా అంకం ఆస్పత్రిలో రోగులకు భరోసాగా నిలుస్తున్న పేరు డా. అంకం గణేష్. ఆయ‌న కేవలం ఆర్థోపెడిక్ సర్జన్ కాదు ఆయ‌న ఓ సేవామూర్తి, ఓ విజ్ఞాన దాత, ఓ జీవిత మార్గదర్శి. అయితే నిజామాబాద్ జిల్లాలో విపత్కరమైన ఫ్రాక్చర్లకు విజయవంతమైన పరిష్కారం అంకం ఆస్పత్రి. తీవ్ర ప్రమాదాల్లో కాలు చేతులు కోల్పోతారనుకున్న రోగులు, డా. గణేష్ చేతుల ద్వారా మళ్లీ నడవగలిగారు. జీవించగలిగారు. ఇది సాధ్యమైనది ఆయన నైపుణ్యం, విశ్వాసం, మానవతా దృక్పథంతో మాత్రమే. 450కి పైగా క్లిష్టమైన ఫ్రాక్చర్ కేసులను, రష్యా టెక్నిక్ – ఇలిజారోవ్ (Ilizarov) ద్వారా అత్యంత విజయవంతంగా నిర్వహించారు. ఇటలీ, జర్మనీ టెక్నిక్‌ల తో గ్రామీణ స్థాయిలోనూ అమలు చేస్తూ ముందుకు వెళుతున్నారు అంకం గణేష్.

ఇటలీ టెక్నిక్  ఎం ఐ ఆర్ ఓ ఎస్  ద్వారా 264కి పైగా శస్త్రచికిత్సలు, అత్యంత తక్కువ కోతలు, వేగంగా మాన్పించే చికిత్సలు అన్నీ నిజామాబాద్‌లోనే అందుబాటులోకి తీసుకువచ్చారు. అంతేకాదు, జర్మనీ టెక్నాలజీ ఆధారిత ఏం ఏ హెచ్ టి, ఈ బి ఓ ఓ (ఓజోన్ థెరపీ) ద్వారా, ఇన్ఫెక్షన్ సోకిన భాగాలను డీబ్రైడ్ లేకుండా బతికించారు. ఇది నడవలేని వారికి తిరిగి ఆశ ఇచ్చిన విషయం. ఇప్పటికే శస్త్రచికిత్స తప్పదనుకున్న అనేక ఏ వి ఎన్ హిప్ (Avascular Necrosis of the Hip) కేసులలో, డా. గణేష్ ఓజోన్ థెరపీ ద్వారా సర్జరీ లేకుండానే రోగులను కోలుకునేలా చేశారు. ఇది రాష్ట్రవ్యాప్తంగా ఓ అనూహ్యమైన వైద్య విజయం.

రోగి మానసిక ప్రశాంతతకు ప్రధానం..

అసలు ప్రత్యేకత ఏమిటంటే రోగి ఖర్చు తగ్గించడమే ఆయన లక్ష్యం. అత్యవసరమైన చికిత్సలకే కట్టుబడి, అవసరం లేని పరీక్షలు, చికిత్సలు లేకుండా, రోగి మనసును గెలుచుకుంటున్నారు. వైద్య సేవలు ఓ సామాజిక బాధ్యత అని ఆయన నమ్మకంగా చెప్పారు.

ప్రతి శనివారం సేవారూప వైద్యదేవుడు..

అంతేగాక, ప్రతి శనివారం ఉచిత వైద్యం అందించడం ద్వారా ఎంతో మంది పేదవారికి జీవన వెలుగు చూపుతున్నారు. ఇది కేవలం ఓ డాక్టర్ చేయగలిగే పని కాదు ఇది ఓ మానవతావాది మాత్రమే చేయగల పని.

ప్రపంచ వేదికలపై నిజామాబాద్ ప్రతిష్ఠను నిలిపిన వైద్యుడు అంకం గణేష్..

ప్రపంచ వేదికలపై తన క్లినికల్ కేసులను ప్రదర్శించి, భారత వైద్య రంగానికి అంతర్జాతీయ గుర్తింపు తీసుకొచ్చారు. అయినా ఆయన పాదాలు నేలమీదే ఉన్నాయి. కళ్ళలో సేవా తపన, మనసులో మానవతా భావం.డా. అంకం గణేష్  శస్త్ర వైద్యాన్ని ఒక విద్యగా కాదు. ఓ విధిగా చూసే సేవామూర్తి. నిజంగా ఆయన ఓ రోగుల హృదయాల్లో భరోసాగా నిలిచారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad