Saturday, December 6, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఘనంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి

ఘనంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి

- Advertisement -

నవతెలంగాణ – చారకొండ 
బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసీ ఆధ్వర్యంలో ప్రపంచ మేధావి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ వర్ధంతి ని శనివారం మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా డిఎస్పి జిల్లా అధ్యక్షులు సాయి మహారాజ్ మాట్లాడుతూ ప్రపంచ మేధావి, భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సమసమాజ స్థాపన కోసం ,సబండవర్గాల అభ్యున్నతి కోసం, ఆయన నడిపిన పోరాటం, సేవలు చిరస్మరణ నియమన్నారు. అంటరానితనం, అస్పృశ్యత తో అలుపెరుగని పోరాటం చేసి దళిత ,బహుజన వర్గాలకు, రాజ్యాంగంలో రిజర్వేషన్లు, ప్రాథమిక హక్కులు, పొందుపరిచి ,ఆత్మగౌరవంతో స్వేచ్ఛ వాతావరణం జీవనం గడిపే అవకాశానికి భారత పౌరులందరికీ కల్పించిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు.

ప్రపంచ దేశాల రాజ్యాంగంలో, భారతదేశ రాజ్యాంగానికి విశిష్ట లక్షణం ఉందని ,విదేశాల్లో సైతం భారతదేశ రాజ్యాంగానికి గొప్ప ప్రఖ్యాతకు ఆయన శ్రమ,కృషి కారణమన్నారు. బీసీ ,ఎస్సీ, ఎస్టీ యువకులు విద్యార్థులు భారత రాజ్యాంగ రిజర్వేషన్లు సద్వినియోగం చేసుకొని, దేశాభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని ఆకాంక్షించారు. అనగారిన వర్గాలు రాజ్యం ఏలినప్పుడే వారికి విముక్తి అని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు చంద్రశేఖర్ మహారాజ్, విష్ణు ,చంద్రశేఖర్, రాధాకృష్ణ ,రాజు ,శేఖర్ ,మల్లేష్, శ్రీశైలం, కొండల్, యాదగిరి, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -