నవతెలంగాణ – పెద్దవూర
అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ఎన్. జనా రెడ్డి ఇటీవల నిర్వహించిన జాతీయ మహాసభల్లో నల్గొండ జిల్లా పెద్దవూర మండలం రామన్న గూడెం గ్రామానికి చెందినఏబీవీపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ఎన్ జనా రెడ్డి ఏబీవీపీ జాతీయ కార్యవర్గ సభ్యునిగా ఎన్నికయ్యారు. నవంబర్ 28,29,30 తేదీలలో డెహ్రాడూన్, ఉత్తరాఖండ్ లో ప్రతిష్థాత్మకంగా జరిగిన ఏబీవీపీ 71వ జాతీయ మహాసభలకు దేశం నలుమూలల నుంచి వేలాది మంది ప్రతినిధులు పాల్గొనగా అట్టహాసంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన ఎన్నికల్లో డా. ఎన్. జనారెడ్డి జాతీయ కార్యవర్గ సభ్యులుగా ఎన్నిక కావడం పట్ల తెలంగాణ ఏబీవీపీ నాయకులు,కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణకు గర్వకారణమని నాయకులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఏబీవీపీ ప్రస్తుత ,పూర్వ కార్యకర్తలు, మిత్రులు, డా. జనా రెడ్డికి అభినందనలు తెలియజేశారు.
జాతీయ కార్యవర్గ సభ్యులుగా డాక్టర్ నక్కల జనారెడ్డి ఎన్నిక
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



