- Advertisement -
నవతెలంగాణ – నల్లగొండ టౌన్
ఇండియన్ మెడికల్ అసోసియేషన్ నీలగిరి బ్రాంచ్ ఆధ్వర్యంలో నిరుపేద కుటుంబాలకు సామాజిక సేవలు, ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించిన డాక్టర్ పుల్లారావుకు తెలంగాణ ఐఎంఏ గురువారం ప్రకటించింది. ఈ అవార్డును నవంబర్ 2న కరీంనగర్ లో జరిగే తెలంగాణ ఐఎంఏ 9వ వార్షికోత్సవంలో ఈ అవార్డును అందజేస్తారు. అవార్డు గ్రహీత డాక్టర్ పుల్లారావు మాట్లాడుతూ నా సేవలను గుర్తించి తెలంగాణ స్టేట్ ఐఎంఏ బెస్ట్ సర్వీస్ అవార్డును ఎంపిక చేయడం ఎంతో గర్వంగా ఉందని తెలిపారు. అవార్డుకు ఎంపిక చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు.
- Advertisement -