- Advertisement -
నవతెలంగాణ – రామారెడ్డి
మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని గురువారం నాన్ కమ్యూనికేబుల్ డిసీసెస్ ప్రోగ్రాం అధికారిణి డా.శిరీష ఆకస్మికంగా తనిఖీ చేశారు. రోగులకు అందుతున్న వైద్య సేవలపై వైద్యాధికారి సురేష్ ను అడిగి తెలుసుకున్నారు. ఏఎన్ఎంలు వారి పరిధిలో గల ప్రజలకు ఎప్పటికప్పుడు షుగర్, బిపి, ఆల్కహాల్, అనుచిత క్యాన్సర్ వ్యాధిగ్రస్తులను గుర్తించి వారికి తగిన వైద్య సేవలు అందించాలని సూచించారు. కార్యక్రమంలో వైద్యులు సురేష్, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -