- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: అమెరికాలో గ్రీన్‌కార్డు పొందడం కోసం చోరీ నాటకాలు ఆడిన 11 మంది భారతీయులను అక్కడి పోలీసులు అరెస్టు చేశారు. ‘యూ వీసా’ పొందడానికి తాము నేర బాధితులమని నమ్మించే ప్రయత్నం చేసినట్లు అధికారులు తెలిపారు. అమెరికాలో నేరాలకు బాధితులై, విచారణకు సహకరిస్తే ‘యూ నాన్ ఇమ్మిగ్రెంట్ స్టేటస్’ (యూ వీసా) లభిస్తుంది. ఈ పథకాన్ని దుర్వినియోగం చేస్తూ వీరు ఈ నాటకానికి తెరలేపినట్లు ఫెడరల్ ప్రాసిక్యూటర్లు పేర్కొన్నారు.
- Advertisement -



