Wednesday, September 10, 2025
E-PAPER
spot_img
Homeసినిమా'కలలే కలలే.. కనులకు నువు కనబడి కలలే'

‘కలలే కలలే.. కనులకు నువు కనబడి కలలే’

- Advertisement -

హీరో కిరణ్‌ అబ్బవరం నటిస్తున్న కొత్త సినిమా ‘ కె-ర్యాంప్‌’. హాస్య మూవీస్‌, రుద్రాంశ్‌ సెల్యులాయిడ్‌ బ్యానర్‌ల మీద రాజేష్‌ దండ, శివ బొమ్మకు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
యుక్తి తరేజా హీరోయిన్‌. జైన్స్‌ నాని దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీ దీపావళి పండుగ కానుకగా అక్టోబర్‌ 18న గ్రాండ్‌ థియేట్రికల్‌ రిలీజ్‌కు రాబోతోంది.
మంగళవారం ఈ సినిమా నుంచి మ్యాజికల్‌ లవ్‌ సాంగ్‌ ‘కలలే కలలే’ను మేకర్స్‌ రిలీజ్‌ చేశారు.
ఈ పాటను చైతన్య భరద్వాజ్‌ క్లాసీ ట్యూన్‌తో కంపోజ్‌ చేయగా, కపిల్‌ కపిలన్‌ అద్భుతంగా పాడారు. భాస్కరభట్ల క్యాచీ లిరిక్స్‌ అందించారు.
‘కలలే కలలే కనులకు నువు కనబడి కలలే, కథలే మొదలే వివరములే తెలియాలే’ అంటూ మంచి లవ్‌ ఫీల్‌తో ఈ పాట సాగుతుంది.
‘హీరో కిరణ్‌ అబ్బవరం తాను నటించే ప్రతి సినిమా ఎంతో కొంత వైవిధ్యంగా ఉండాలని కోరుకుంటారు. అలాగే ఆయన పోషించే పాత్రలు సైతం అలాగే ఉండాలని ఆశిస్తారు. అందుకే ఆయనకంటూ ఓ ప్రత్యేక అభిమాన గణం ఉంది. ఈ సినిమా కథతోపాటు ఆయన పోషించిన పాత్ర కూడా చాలా భిన్నంగా ఉంటుంది. ముఖ్యంగా ఆయన పాత్ర అందర్నీ సర్‌ప్రైజ్‌ చేస్తుంది’ అని మేకర్స్‌ తెలిపారు. నరేష్‌, సాయి కుమార్‌, వెన్నెల కిషోర్‌ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి ప్రొడక్షన్‌ డిజైనర్‌ – బ్రహ్మ కడలి
యాక్షన్‌ – పథ్వీ, ఎడిటర్‌ – ఛోటా కె ప్రసాద్‌, డీవోపీ – సతీష్‌ రెడ్డి మాసం, మ్యూజిక్‌ – చేతన్‌ భరద్వాజ్‌.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad