•సర్పంచ్ లపంగి నరసింహ
నవతెలంగాణ-మర్రిగూడ
వేసవికాలం దృష్ట్యా గ్రామస్తులు త్రాగు నీటిని వృధా చేయకుండా పొదుపుగా వాడుకోవాలని మండలంలోని రాంరెడ్డి పల్లి గ్రామ సర్పంచ్ లపంగి నరసింహ గ్రామస్తులకు సూచించారు.బుధవారం గ్రామంలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా గ్రామపంచాయతీ సిబ్బందితో మంచినీటి ట్యాంకులను శుభ్రం చేయించిన సందర్భంగా ఆయన మాట్లాడారు.
గ్రామస్తులు వ్యక్తిగత పరిశుభ్రత తో పాటు పరిసరాల పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు.చెత్తను వీధుల్లో ఎక్కడపడితే అక్కడ వేయకుండా గ్రామపంచాయతీ చెత్త సేకరణ ట్రాక్టర్ లో వేయాలన్నారు.గ్రామం పరిశుభ్రంగా ఉంటేనే గ్రామ ప్రజలు రోగాల బారిన పడకుండా ఆరోగ్యంగా ఉంటారని అన్నారు.ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి నజీరా,వార్డు సభ్యులు లపంగి మహేందర్,వడ్డే లోకేష్,లపంగి విజయ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.



