నవతెలంగాణ – కమ్మర్ పల్లి
మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో బుధవారం కేంద్ర ప్రభుత్వం సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో మాదక ద్రవ్యాల దుర్వినియోగంపై నశా ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. భారతీయ సమాజాన్ని చైతన్యవంతం చేయడానికి నశా ముక్త్ భారత్ అభియాన్ పేరుతో ప్రచార కార్యక్రమాలు కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిందని జూనియర్ కళాశాల అధ్యాపకులు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి ఐదు సంవత్సరాలు పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకుని కళాశాలలో విద్యార్థులతో సామూహిక ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం అధ్యాపకులు విద్యార్థులకు మాదకద్రవ్యాల దుర్వినియోగం, నివారణ తదితర అంశాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు మధు కుమార్, రాజ్ కుమార్, వెంకటేష్, గంగాధర్, వైష్ణవి, శ్రీహరి, మురళి, స్వాతి, తదితరులు పాల్గొన్నారు.
జూనియర్ కళాశాలలో నశా ముక్త్ భారత్ అభియాన్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES