Saturday, October 18, 2025
E-PAPER
Homeహైదరాబాద్డ్రగ్స్ రహిత సమాజం–సువర్ణ భవిష్యత్తు: బి.వెంకటేశం

డ్రగ్స్ రహిత సమాజం–సువర్ణ భవిష్యత్తు: బి.వెంకటేశం

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: సితాఫలమండి ప్రభుత్వ డిగ్రీ కళాశాల NSS యూనిట్ -1ప్రత్యేక శిబిరం ఆరో రోజులో భాగంగా వాలంటీర్లు ఘట్కేసర్ మండలంలోని కొర్రేముల గ్రామంలో అంటీ డ్రగ్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో విద్యార్థులు మాదక ద్రవ్యాల వలన కలిగే దుష్పరిణామాలను ప్రజలకు వివరించి, యువతలో మత్తు పదార్థాలపై అవగాహన పెంచారు. NSS కార్యక్రమ అధికారి శ్రీ బి. వెంకటేశం మార్గదర్శకత్వంలో ఈ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించారు.

విద్యార్థులు ప్రజలకు “మత్తు రహిత సమాజం – సువర్ణ భవిష్యత్తు” అనే నినాదంతో పిలుపునిచ్చారు. గ్రామ ప్రజలు NSS వాలంటీర్ల సేవా కార్యక్రమాలను అభినందించారు. ఈకార్యక్రమంలో అకాడమిక్ కో ఆర్డినేటర్ డా. సైదులు, డా. సరోజ, విమలదేవి, సమతా వాని, డా. కిషోర్, ప్రత్యుష, రామకృష్ణ, వాలంటీర్స్ మహాలక్ష్మి,అరుణ, స్నేహ సంధ్య, వెన్నెల, శ్రావణి, నందిని, దివ్యశ్రీ, పూజ, సౌజన్య,భువనేశ్వరి, భార్గవి, సాయి, అరుణ్, నవీన్ సందీప్,ఖలీద్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -