Sunday, August 3, 2025
E-PAPER
Homeతాజా వార్తలుచేవెళ్లలో డ్రగ్స్‌ పార్టీ..ఆరుగురు ఐటీ ఉద్యోగులు అరెస్ట్‌

చేవెళ్లలో డ్రగ్స్‌ పార్టీ..ఆరుగురు ఐటీ ఉద్యోగులు అరెస్ట్‌

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో డ్రగ్స్‌ పార్టీ కలకలం సృష్టించింది. సెరీన్‌ ఆచార్జ్‌ ఫామ్‌హౌస్‌లో బర్త్‌డే వేడుకల పేరుతో డ్రగ్స్‌, విదేశీ మద్యంతో ఐటీ ఉద్యోగులు సెలబ్రేట్‌ చేసుకున్నారు. విస్వనీయ సమాచారం అందడంతో ఎస్‌టీఎఫ్‌ బీ టీమ్‌, ఎక్సైజ్‌ పోలీసులు ఫామ్‌హౌస్‌లో సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా రూ.2 లక్షల విలువైన డ్రగ్స్‌తో పాటు 3 లగ్జరీ కార్లను సీజ్‌ చేశారు. బర్త్‌డే వేడుకల్లో పాల్గొన్న వారికి డ్రగ్స్‌ టెస్ట్‌ నిర్వహించారు. ఆరుగురు ఐటీ ఉద్యోగులకు పాజిటివ్‌ రావడంతో పోలీసులు వారిని అరెస్టు చేశారు. బర్త్‌డే సందర్భంగా ఐటీ ఉద్యోగి అభిజిత్‌ బెనర్జీ ఫామ్‌హౌస్‌ను బుక్ చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. డ్రగ్స్‌ను హిమాచల్‌ప్రదేశ్‌ నుంచి తీసుకొచ్చినట్లు గుర్తించామన్నారు. ఫామ్‌హౌస్‌ నిర్వాహకుడిపై పోలీసులు కేసు నమోదు చేశామన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -