– ఐటీ ఉద్యోగి పుట్టిన రోజు వేడుకల్లో రూ.2లక్షల డ్రగ్స్, మద్యం పట్టివేత
– రూ. 50 లక్షల విలువ చేసే మూడు కార్లు స్వాధీనం
– ఆరుగురు ఐటీ ఉద్యోగులు, ఫామ్‌హౌస్ నిర్వాహకునిపై కేసు నమోదు
నవతెలంగాణ-మొయినాబాద్
రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం మేడిపల్లి గ్రామ శివారులోని సెరీన్ ఆచార్జ్ ఫామ్‌హౌస్‌లో డ్రగ్స్ కలకలం రేపింది. పుట్టినరోజు వేడుకల పేరుతో ఫామ్‌హౌస్‌ను బుక్ చేసుకొని అందులో డ్రగ్స్, ఖరీదైన మద్యంతో ఎక్సైజ్ శాఖకు ఆరుగురు ఐటీ ఉద్యోగులు పట్టుబడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అభిజిత్ బెనర్జీ అనే వ్యక్తి పుట్టినరోజు సందర్భంగా సెరీన్ ఆచార్జ్ ఫామ్‌హౌస్ బుక్ చేసుకున్నారు. ఐదు ఖరీదైన మద్యం బాటిళ్లతో డ్రగ్స్ తీసుకుంటూ మద్యం తాగుతూ ఎంజారు చేస్తున్నారని పోలీసులకు సమాచారం అందింది. ఈ మేరకు ఎస్‌జీఎఫ్‌బీ టీం, సీఐ భిక్షపతి, ఎస్‌ఐ బాలరాజు సిబ్బందితో కలిసి ఫామ్‌హౌస్‌పై దాడి చేశారు. ఈ దాడిలో రూ.2లక్షల విలువైన డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్ కిట్స్‌తో పరీక్షలు నిర్వహించగా అందరికీ పాజిటివ్ వచ్చింది. అభిజిత్ బెనర్జీ, సింపుల్ ప్రతాప్, గోయల్ జస్వంత్, దినేష్ వ్యక్తులతో పాటు ఫామ్‌హౌస్ నిర్వాహకునిపై కేసు నమోదు చేశారు. వీరిని చేవెళ్ల ఎక్సైజ్ పోలీస్ స్టేషన్‌లో అప్పగించారు. నిందితుల నుంచి రూ.50 లక్షల విలువైన మూడు కార్లను, రెండు లక్షల విలువైన డ్రగ్స్, మద్యం స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్ పార్టీని విఫలం చేసిన ఎస్‌జీఎఫ్‌బీ బృందంను ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ షాన్వాస్ కాసిం అభినందించారు.
సెరీన్ ఆచార్జ్ ఫామ్‌హౌస్‌లో డ్రగ్స్ కలకలం
- Advertisement -
- Advertisement -