Wednesday, August 6, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మత్తు పదార్థాలు జీవనాన్ని నాశనం చేస్తాయి

మత్తు పదార్థాలు జీవనాన్ని నాశనం చేస్తాయి

- Advertisement -

– కమ్మర్ పల్లి ఎస్ఐ అనిల్ రెడ్డి 
– హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలి
నవతెలంగాణ-కమ్మర్ పల్లి 
మత్తు పదార్థాలు జీవనాన్ని నాశనం చేస్తాయని,  మాదకద్రవ్యాల వినియోగం నేరం, చట్టపరమైన శిక్షకు లోనవుతారని కమ్మర్ పల్లి ఎస్ఐ అనిల్ రెడ్డి అన్నారు. మాదక ద్రవ్యాల దుష్పరిణామాలను వివరిస్తూ యువత మాదక ద్రవ్యాల నుంచి దూరంగా ఉండాలని కోరారు. కల్తీ కల్లు వద్దు జీవితం ముద్దు అన్నారు.మంగళవారం రాత్రి మండలంలోని బషీరాబాద్ గ్రామంలో కమ్మర్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య ఆదేశాల మేరకు పొలీస్ కళాబృందం వారి అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా ప్రజలకు నాటికలు, పాటల రూపంలో వివిధ సామాజిక అంశాలపై విలువైన సందేశాలను పోలీస్ కళాబృందం సభ్యులు అందించారు. అనంతరం గ్రామస్తులను ఉద్దేశించి ఎస్ఐ అనిల్ రెడ్డి మాట్లాడుతూ… ప్రజలు ద్విచక్ర వాహనాలు నడిపేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని హెల్మెట్ బరువు కాదు, ఇది బాధ్యత అన్నారు. ప్రతి ఒక్కరు రోడ్డు భద్రత నియమాలు తప్పనిసరిగా పాటించాలన్నారు.ఆటోలో పరిమితికి మించి ప్రయాణికులను తీసుకుని వెళ్ళరాదన్నారు. మహిళలు ఏవైనా అసౌకర్యానికి గురైనపుడు రక్షణ కోసం షీ టీం నంబర్ 8712659795 లేదా డయల్ 100 కు కాల్ చేయాలని సూచించారు.

మొబైల్ ఫోన్ చోరీకి గురైనప్పుడు లేదా పోయిన సందర్భంలో తగిన ఆధారాలతో ఫిర్యాదు చేస్తే సీఈఐఆర్  పోర్టల్ ద్వారా రికవరీ చేయించుకోవచ్చు అన్నారు.అత్యవసర పరిస్థితుల్లో,ఎమర్జెన్సీ సేవల కోసం ప్రజలు డయల్ 100 ఉపయోగించుకోవాలని సూచించారు.సైబర్ మోసాల నుండి రక్షణ కోసం అప్రమత్తంగా ఉండాలని, ఏదైనా మోసానికి గురైతే టోల్ ఫ్రీ నంబర్ 1930 కు ఫోన్ చేయాలన్నారు. ప్రజలందరూ అన్నదమ్ముల్లా శాంతియుతంగా కలిసిమెలిసి జీవించాలన్నారు. సమాజంలో జరుగుతున్న నేరాలు, చట్టాలపై గ్రామస్తులకు ఆయన అవగాహన కల్పించారు. కార్యక్రమంలో కళాబృందం సభ్యులు, ప్రజలు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -