- Advertisement -
నవతెలంగాణ-గోవిందరావుపేట
మండల కేంద్రంలో ఇసుక లారీల డ్రైవర్లకు శనివారం డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులను పసర పోలీసులు నిర్వహించారు. ఈ సందర్భంగా పసర పోలీస్ స్టేషన్ ఎస్ఐ కమలాకర్ లారీ డ్రైవర్లతో మాట్లాడుతూ.. మద్యం సేవించి లారీలను నడప రాదని అన్నారు. అలాగే పరిమితికి మించి ఇసుకను రవాణా చేయడం కూడా నేరమే అని అన్నారు. ఇకపై మద్యం సేవించి వాహనాలు నడిపిన పరిమితికి మించి ఇసుకను తరలించిన చట్టరీత్య చర్యలు తప్పవని డ్రైవర్లను హెచ్చరించారు. ప్రతిరోజు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహించబడతాయని జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
- Advertisement -