Monday, August 18, 2025
E-PAPER
spot_img
HomeఆటలుDuleep Trophy: ఈస్ట్ జోన్ జట్టుకు షాక్.. ఇషాన్ కిషన్ ఔట్

Duleep Trophy: ఈస్ట్ జోన్ జట్టుకు షాక్.. ఇషాన్ కిషన్ ఔట్

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: దులీప్ ట్రోఫీలో భాగంగా ఈస్ట్ జోన్ జట్టుకు షాక్ . ఈస్ట్ జోన్ కెప్టెన్ ఇషాన్ కిషాన్ ఈ డొమెస్టిక్ టోర్నీకి దూరం కావడంతో ఆ జట్టుకు బిగ్ షాక్ తగిలింది. ముఖ్యంగా టీమిండియా ఆసియా కప్ స్క్వాడ్ లో ఎంపికవుతాడనుకున్న కిషాన్ కు ఇది పెద్ద దెబ్బ. వికెట్ కీపర్ రిషబ్ పంత్ ఇప్పటికే గాయం కారణంగా ఆసియా కప్ కు దూరం కాగా.. సంజు శాంసన్ స్థానంలో రిజర్వ్ వికెట్ కీపర్ గా కిషాన్ ను  సెలక్ట్ అవుతాడనుకున్నారు. అయితే గాయంతో కిషాన్ ఛాన్స్ మిస్ చేసుకున్నాడు.  జూన్‌లో జరిగిన కౌంటీ ఛాంపియన్‌షిప్‌లో చివరిసారిగా కిషాన్ నాటింగ్‌హామ్‌షైర్ తరపున ఆడాడు. కొద్ది రోజుల క్రితమే ఈస్ట్ జోన్ కెప్టెన్‌గా నియమించారు. అయితే గాయం ఈ టీమిండియా వికెట్ కీపర్ కు బిగ్ షాక్ ఇచ్చింది. కిషాన్ స్థానంలో 20 ఏళ్ల ఆశీర్వాద్ స్వైన్‌ను ఎంపిక చేసినట్లు ఒడిశా క్రికెట్ అసోసియేషన్ ధృవీకరించింది. కిషన్‌ అందుబాటులో లేకపోవడంతో బెంగాల్‌ బ్యాటర్ అభిమన్యు ఈశ్వరన్ ఈస్ట్ జోన్ కెప్టెన్ గా బాధ్యతలు స్వీకరించనున్నాడు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad