నవతెలంగాణ-హైదరాబాద్ : ఎర్రకోటలో డమ్మీ బాంబ్‌ను గుర్తించలేకపోయిన భద్రతా సిబ్బందిపై అధికారులు వేటు వేశారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకల నేపథ్యంలో ఎర్రకోటలో గత శనివారం సెక్యూరిటీ డ్రిల్ నిర్వహించారు. ఇందులో భాగంగా సాధారణ వ్యక్తులు ఎర్రకోటలోకి ప్రవేషించిన స్పెషల్ సెల్ సిబ్బంది డమ్మీ బాంబును తమ వెంట తీసుకెళ్లారు. అయితే విధుల్లో ఉన్న భద్రతా సిబ్బంది ఆ బాంబును గుర్తించలేక పోయారు.
దీంతో ఆ సమయంలో విధులు నిర్వహిస్తున్న ఏడుగురు పోలీసులను అధికారులు సస్పెండ్ చేశారు. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహించినందుకు వేటు వేస్తున్నట్లు చెప్పారు. వారిలో కానిస్టేబుళ్లు, హెడ్ కానిస్టేబుళ్లు ఉన్నారు. ప్రతి ఏడాది నిర్వహించే స్వాంతంత్య్ర దినోత్సవ వేడులను ఎర్రకోటలో నిర్వహించే విషయం తెలిసిందే. ప్రధాని మోడీ జాతీయ జెండాను ఎగురవేస్తారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రులు, వివిధ పార్టీలకు చెందిన ప్రముఖ నేతలు, ఉన్నతాధికారులు ఈ వేడుకలకు హాజరవుతారు. ఈ నేపథ్యంలో వేడుకల సన్నద్ధతలో భాగంగా భద్రతా చర్యల్లో భాగంగా మాక్ డ్రిల్స్ నిర్వహిస్తూ ఉంటారు.