నవతెలంగాణ-గోవిందరావుపేట
చోటే కాన్ రాష్ట్రస్థాయి కరాటే పోటీలలో జూపల్లిగూడెం విద్యార్థులు అద్భుత ప్రతిభను కనబరిచి మెడల్స్ సాధించారు. బుధవారం పాఠశాలలో హెడ్మాస్టర్ తిరుపతయ్య ఆధ్వర్యంలో మెడల్స్ సాధించిన విద్యార్థులను అభినందించారు. ఈ కార్యక్రమానికి పసర పోలీస్ స్టేషన్ ఎస్ఐ ఎస్ కే తాజుద్దీన్ హాజరై విద్యార్థులను అభినందిస్తూ విద్యార్థులకు రూ.5000 నగదు, ఇన్స్ట్రక్టర్ కు రూ.2000 నగదు అందించి ప్రోత్సహించారు.
అదేవిధంగా గ్రామ సర్పంచ్ భానోత్ సీతారాం నాయక్ విద్యార్థులు ముందు ముందు గ్రామానికి భరించ మంచి పేరు ప్రతిష్టలు సాధించి పెట్టాలని వారి అభివృద్ధికి ఎనిమిది వేల రూపాయల నగదును అందించారు.ప్రథమ స్థానం పొందిన, శ్రవన సింధు, నూతన, ద్వితీయ స్థానం సాయి ప్రియ, స్వేచ్ఛ, తృతీయ స్థానం, శరణ్య లను ముందు ముందు కరాటే లో విద్యార్థులకు స్ఫూర్తిగా నిలవాలని సూచించారు.
మండల విద్యాధికారి గొంది దివాకర్ మాట్లాడుతూ ..విద్యార్థులు అద్భుతమైన ప్రతిభ కనబరచడం గర్వించదగ్గ విషయమని అన్నారు. విద్యార్థులకు వారికి ఇష్టమైన రీతిలో శిక్షణ ఇస్తే మరింత ప్రతిభ కనబరుస్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో, గ్రామ పెద్దలు, సూది రెడ్డి జనార్దన్ రెడ్డి, లక్ష్మారెడ్డి, కట్ల జనార్దన్ రెడ్డి, , గ్రామస్తులు, ములుగు జిల్లా, సూర్యషో టో కాన్, కరాటే కోచ్ గొంది మొగిలిగారు ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.



