- Advertisement -
నవతెలంగాణ-మద్నూర్: 9 రోజులపాటు కొనసాగిన దుర్గామాత శరన్నవరాత్రి ఉత్సవాలు దసరా నాటితో ముగిశాయి. దసరా రోజు గురువారం దుర్గామాత విగ్రహాలను మండల కేంద్రంలో శోభ యాత్ర నిర్వహించారు. ఈ శోభాయాత్రలో మద్నూర్ సింగిల్విండో చైర్మన్ శ్రీనివాస్ పటేల్ దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా వారు దుర్గామాత దేవిని ప్రార్థిస్తూ ప్రజలంతా సుఖ సంతోషాలతో జీవించేలా చూడాలని కోరుకున్నట్లు తెలిపారు. దుర్గామాత ప్రత్యేక పూజలు దంపతులతో పాటు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు
- Advertisement -