Friday, January 9, 2026
E-PAPER
Homeజాతీయంప్రభుత్వ స్థలంలో దుర్గా ఆలయం

ప్రభుత్వ స్థలంలో దుర్గా ఆలయం

- Advertisement -

రాజ్యాంగ విలువలు ఉల్లంఘిస్తూ మమత ప్రకటన
సవాలు చేయనున్న ఎంపీ వికాస్‌ రంజన్‌ : సీపీఐ(ఎం) విమర్శ


కోల్‌కతా : వ్యాపార ప్రయోజనాల కోసం తొలుత ఉద్దేశించబడిన ప్రభుత్వ స్థలంలో దుర్గాదేవీ ఆలయం నిర్మించనున్నట్టు ప్రకటించడం ద్వారా పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ దేశ, రాష్ట్ర రాజ్యాంగ విలువలను, లౌకిక కూర్పును దెబ్బతీశారు. శాటిలైట్‌ టౌన్‌షిప్‌ అయిన రాజార్హత్‌ న్యూ టౌన్‌ ఏరియాలో ఆ ప్రాంతంలో ఇకపై ఆలయ నిర్మాణం జరుగుతుందని, దుర్గా పూజలు కొనసాగుతాయని ఆమె ప్రకటించారు. దీనిపై రాజ్యసభ ఎంపీ, లాయర్‌ అయిన వికాస్‌ రంజన్‌ భట్టాచార్య తీవ్రంగా స్పందించారు. రాజ్యాంగంలోని 27వ అధికరణ కింద ప్రభుత్వ నిధులు వేటినీ మతపరమైన కార్యక్రమాలకు ఉపయోగించరాదన్నారు.

లెఫ్ట్‌ వ్యూస్‌ తో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇమామ్‌లకు వేతనాలు చెల్లించడం రాజ్యాంగ విరుద్దమని ఇప్పటికే కలకత్తా హైకోర్టు రూలింగ్‌ ఇచ్చిందన్నారు. తామెంతగానో కష్టపడి సంపాదించిన సొమ్ములో ప్రజలు కట్టే పన్నులు ప్రజల అవసరాలు తీరేలా సామాజిక అభివృద్ధికి ఉపయోగపడాలి తప్ప ఇలా మతపరమైన ప్రయోజనాలకు కాదని ఆయన స్పష్టం చేశారు. ఒక మతానికి చెందిన వారి కోసం ఇలా ఆలయాన్ని నిర్మించడం, దానికోసం ప్రభుత్వ నిధులు వినియోగించడం రాజ్యాంగంలోని 14, 27 అధికరణలను ఉల్లంఘిస్తున్నాయని అన్నారు. ఇది రాజ్యాంగ నైతికతను దెబ్బ తీస్తోందని విమర్శించారు. కలకత్తా హైకోర్టులో దీన్ని సవాలు చేయనున్నట్లు చెప్పారు.

సీపీఐ(ఎం) విమర్శ
సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు సుజన్‌ చక్రవర్తి ఈ చర్యను తీవ్రంగా విమర్శించారు. ఆలయాలు లేదా మసీదులు నిర్మించడానికి ప్రభుత్వానికి ఎలాంటి బాధ్యతలు అప్పగించలేదు. జీవనభృతి కోసం జరిపే పోరాటాల నుంచి కుల, మతాల పేరుతో రాజకీయాలు నడిపే వైపునకు మమతా దృష్టి మారిందని విమర్శించారు. పూ.జా క్లబ్‌ల పాత్రను ఆయన ఈ సందర్భంగా ఉదహరించారు. చారిత్రకంగా పేదలకు సేవలందించే ఈ పూజా క్లబ్‌లు దుర్గాపూజ సమయంలో తృణమూల్‌ నుంచి రూ.1.25లక్షలు అందుకున్న తర్వాత మతపరమైన ఉత్స వాల పేరుతో విలాసవంతమైన విందు భోజనాలు అందిస్తున్నారని విమర్శించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -