– సొసైటీ చైర్మన్ కన్నయ్య గారి హరికృష్ణ రెడ్డి.
నవతెలంగాణ – తొగుట
గత ప్రభుత్వంలో ఎలాంటి ఆంక్షలు విధించకుండా రైతులకు కావలసిన యూరియా అందజేసామని సొసైటీ చైర్మన్ కన్నయ్య గారి హరికృష్ణ రెడ్డి అన్నా రు. ఆదివారం మండలంలోని ఎల్లారెడ్డిపేట గ్రామం లో సొసైటీ ఆధ్వర్యంలో రైతులకు యూరియాను అందజేసారు. అనంతరం సొసైటీ చైర్మన్ మాట్లా డుతూ సొసైటీ రైతులకు ఎల్లవేళలా అండగా ఉంటుందని తెలిపారు. రైతులకు ఎలాంటి ఇబ్బం దులు తలెత్తకుండా అధికారులతో మాట్లాడి ఎల్లా రెడ్డిపేట సొసైటీ గోదాంకు యూరియాను తీసుకు వచ్చి రైతులకు అందించామన్నారు.
ప్రభుత్వం రైతులకు కావలసినంత యూరియా వచ్చేవరకు సొసైటీ అండగా ఉంటుందన్నారు. గత ప్రభుత్వం లో ఎలాంటి ఆంక్షలు విధించకుండా రైతులకు కావలసిన యూరియా అందజేసామని గుర్తు చేశారు. రైతులు వేసిన పంటలకు కావలసిన సమయంలో యూరియాను అందించి రైతుల ఎదుగుదలకు ప్రభుత్వం కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ నారాయణ రెడ్డి, మాజీ ఎంపీటీసీ వేల్పుల స్వామి, మాజీ సర్పంచ్ బుర్ర అనిత నర్సింలు, సొసైటీ సీఈవో గంగారెడ్డి, ఏఈఓ నాగార్జున, రైతులు తదితరులు పాల్గొన్నారు.