Wednesday, July 23, 2025
E-PAPER
Homeఆదిలాబాద్ఉద్యమకారుల ముందస్తు అరెస్టు

ఉద్యమకారుల ముందస్తు అరెస్టు

- Advertisement -

నవతెలంగాణ – జన్నారం
 తెలంగాణ ఉద్యమ కారుల ఫోరమ్ రాష్ట్ర కమిటీ చలో గన్ పార్క్ పిలుపు మేరకు హైదరాబాద్ గన్ పార్కు వెళ్లకుండా తెలంగాణ ఉద్యమకారుడు కమ్మల విజయ ధర్మను జన్నారం పోలీసులు మంగళవారం ఉదయం ముందస్తు అరెస్టు చేశారు. సందర్భంగా తెలంగాణ ఉద్యమకారుడు కమ్మల విజయ ధర్మ మాట్లాడుతూ.. ప్రభుత్వం  ఇలాంటి అక్రమ అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరన్నారు. తెలంగాణ ఉద్యమ కారుల కి ఇచ్చిన హామీలను ప్రభుత్వం వెంటనే అమలు చేయాలన్నారు. ఒక కమిటీ ఏర్పాటు చేసి తెలంగాణ ఉద్యమ కారుల ను గుర్తించి గుర్తింపు కార్డులు జారీ మేనిఫెస్టో లో ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలని కోరుతున్నాను. లేకుంటే రాబోవు రోజుల్లో తెలంగాణ ఉద్యమకారులు అంతా  పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామన్నారు..

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -