Thursday, August 7, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్పాఠశాలలో ముందస్తు రక్షాబంధన్ వేడుకలు

పాఠశాలలో ముందస్తు రక్షాబంధన్ వేడుకలు

- Advertisement -

నవతెలంగాణ-కమ్మర్ పల్లి
మండలంలోని ఉప్లూర్ మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలో గురువారం రక్షాబంధన్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు ఒకరినొకరు రాఖీలు కట్టుకొని పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. రాఖీ పండుగ సందర్భంగా ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు మాసం శ్రీనివాస్ గౌడ్ విద్యార్థులకు అక్షరాలు, పదాలతో వినూత్నంగా రాఖీలు తయారుచేసి వారి చేతులకు కట్టి విద్యార్థులచే వాటిని చదివించారు.

ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు గిరిధర్  మాట్లాడుతూ రక్షాబంధన్ పండుగ విశిష్టతను విద్యార్థులకు వివరించారు. రాఖీ పండుగ సోదరీ సోదరుల ప్రేమానురాగాలకు ప్రతీక అని, రక్షాబంధన్ పండుగను ప్రజలంతా ఆనందోత్సవాలతో జరుపుకునే అతి ముఖ్యమైన పండుగ అని పేర్కొన్నారు. కార్యక్రమంలో  ఉపాధ్యాయురాలు శిరీష, తదితరులు  పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img