- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : వికారాబాద్ జిల్లాలో స్వల్పంగా భూమి కంపించింది. పరిగి మండలం పరిధిలో భూకంపం వచ్చింది. బసిరెడ్డిపల్లి, రంగాపూర్, న్యామత్‌నగర్‌లో ప్రకంపణలు వచ్చాయి. గురువారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో మూడు సెకన్లపాటు భూమి కంపించిందని స్థానికులు వెల్లడించారు. భయాందోళనలకు గురైన ప్రజలు ఇండ్ల నుంచి రోడ్లపైకి బయటకు పరుగులు తీశారు.
- Advertisement -