Monday, August 11, 2025
E-PAPER
spot_img
Homeజాతీయంగుజరాత్, అరుణాచల్‌ ప్రదేశ్‌లలో భూప్రకంపనలు..

గుజరాత్, అరుణాచల్‌ ప్రదేశ్‌లలో భూప్రకంపనలు..

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : గుజరాత్‌ రాష్ట్రంలోని కచ్చ్‌ జిల్లాలో మరోసారి భూప్రకంపనలు చోటు చేసుకున్నాయి. రిక్టర్ స్కేల్‌పై దీని తీవ్రత 4.0గా నమోదైంది. శనివారం రాత్రి 9:47 గంటలకు భూమి కంపించింది. ఈ భూకంపం కేంద్రం ఖావడా ప్రాంతానికి 20 కిలోమీటర్ల దూరంలోని ఈస్ట్-సౌత్ ఈస్ట్ దిశగా ఉన్నట్టు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది. అయితే ఇప్పటివరకు ఎటువంటి ప్రాణనష్టం లేదా ఆస్తినష్టం జరిగినట్టు సమాచారం లేదు.

భూమి కంపించడంతో ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. గత మూడు రోజుల్లో కచ్చ్‌లో ఇది మూడోసారి భూకంపం సంభవించటం గమనా ర్హం. మరోవైపు అరుణాచల్‌ ప్రదేశ్‌ లోనూ భూప్రకంపనలు సంభవించాయి. రిక్టర్ స్కేల్‌పై దీనితీవ్రత 3.4గా నమోదైంది. భూకంపం ఆదివారం ఉదయం 10:59 గంటలకు సంభవించింది. సుబన్సిరి ప్రాంతం కేంద్రంగా ఈ భూకంపం నమోదైంది. ఈ భూకంపం తక్కువ తీవ్రతతో ఉన్నా ప్రజలు అందిలనకు గురయ్యారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని, ప్రజలు సురక్షిత మార్గదర్శకాలు పాటిస్తూ అలెర్ట్ గా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img