నవతెలంగాణ న్యూఢిల్లీ : ఎన్నికల నిర్వహణలో ఎన్నికల కమిషన్ (ఈసి) అక్రమాలకు పాల్పడుతోందని లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ వ్యాఖ్యానించారు. పెద్ద ఎత్తున ఓటర్ల మోసం జరుగుతోందని అన్నారు. గతేడాది లోక్‌సభ ఎన్నికల్లో మహారాష్ట్రలోని 48 స్థానాలకు 30 స్థానాలు గెలుచుకున్న ఇండియా బ్లాక్, ఐదు నెలల తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 50 మార్కును కూడా దాటలేకపోయిందని అన్నారు. దీని తర్వాత ఏదో జరుగుతోందని అర్థమైందని అన్నారు.
ఎగ్జిట్ పోల్స్, ఒపీనియన్ పోల్స్‌కు వ్యతిరేకంగా ఎన్నికల ఫలితాలు వస్తున్నాయని అన్నారు. హర్యానా, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌ల ఫలితాలు ఉదాహరణని అన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో ఇండియా బ్లాక్ గెలుస్తుందని, అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలవుతోందని అన్నారు. మహారాష్ట్రలో ఐదు నెలల్లో ఎక్కువ మంది ఓటర్లను చేర్చారని, కోటి మంది కొత్త ఓటర్లు ఓటు వేశారని అన్నారు. మొదటిసారిగా మహారాష్ట్రలో తప్పు జరిగిందని అర్థమైందని అన్నారు. కానీ ప్రతిపక్షాల ప్రశ్నలకు సమాధానమివ్వకుండా ఎన్నికల కమిషన్ తప్పించుకు తిరుగుందని అన్నారు. పరిశీలించడానికి డిజిటల్ ఓటరు జాబితాను ఇచ్చేందుకు ఎన్నికల కమిషన్ నిరాకరించిందని అన్నారు.
కర్ణాటకలోని మహాదేవపుర అసెంబ్లీ స్థానంపై దృష్టిసారించామని, సర్వేలో కర్ణాటకలో 16 లోక్‌సభ స్థానాల్లో గెలుస్తామని భావించాం కానీ తొమ్మిది గెలిచామని అన్నారు. 1,00,250 దొంగ ఓట్లను గుర్తించామని అన్నారు. నకిలీ ఓటర్లు, నకిలీ, చెల్లని చిరునామాలు, ఒకే చిరునామాలో బల్క్ ఓటర్లను గుర్తించామని అన్నారు. అక్కడికి వెళ్లి పరిశీలించగా ఓటర్ల జాబితాలో పేర్కొన్నవారు లేరని, ఆ ఇంట్లో ఒక కుటుంబం నివసిస్తోందని అన్నారు. కాంగ్రెస్ చేపట్టిన దర్యాప్తులో ఒక్క కర్ణాటకలోనే 40,000కు పైగా నకిలీ మరియు చెల్లని చిరునామాలు ఉన్నట్లు తేలిందని అన్నారు.
Rahul Gandhiఅక్రమాలకు పాల్పడుతున్న ఈసీ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES