నవతెలంగాణ-హైదరాబాద్: మరోసారి ఎన్నికల సంఘంపై ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు గుప్పించారు. ఒక వ్యక్తి..ఒక ఓటు అనే రాజ్యాంగ స్ఫూర్తికి ఈసీ తూట్లు పొడిచిందని, అందుకు నిదర్శనం బీహార్‌లో చేపట్టిన ఎస్ఐఆర్ ప్రక్రియ అని గుర్తు చేశారు. ఈసీ తన విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని, రాజ్యాంగ పరిరక్షణే ధ్యేయంగా తమ పోరాటం కొనసాగుతుందని ఆయన ఢిల్లీ పార్లమెంట్ మీడియా సమావేశంలో పేర్కొన్నారు. రాజ్యాంగం ప్రకారం ప్రతి వ్యక్తికి ఓటు హక్కు కల్పించడం ఎన్నికల సంగం బాధ్యత, కానీ అందుకు విరుద్ధంగా ఈసీ ప్రవరిస్తుందని రాహుల్ గాంధీ విమర్శించారు.
అదే విధంగా పార్లమెంట్ ప్రాంగణంలో ఇండియా బ్లాక్ కూటమి పార్టీలు ఎస్ఐఆర్‌కు వ్యతిరేకంగా ఆందోళన చేపట్టిన విషయం తెలిసిందే. కూటమి ఎంపీలందరూ టీ షెర్టులు ధరించి నిరసన వ్యక్తం చేశారు. రాజ్యాంగం పరిరక్షణ కోసం, ప్రజాస్వామ్య ఉనికి కోసం తమ పోరాట కొనసాగిస్తామని ఎంపీలు పేర్కొన్నారు.