- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల కోసం స్టేట్ ఎన్నికల సంఘం కొత్త ఓటర్ల జాబితాను సిద్ధం చేసేపనిలో ఉంది. 18 ఏళ్లు నిండినవారి పేర్ల నమోదుతోపాటు మరణించినవారి పేర్లు తొలగించి కొత్త ఓటరు లిస్టు తయారు చేయాలని పంచాయతీ కార్యదర్శులకు జిల్లా పంచాయతీ అధికారుల (డీపీవోలు) నుంచి ఆదేశాలు వెళ్లాయి. గ్రామాలు మున్సిపాలిటీల్లో కలపడం, కొత్త మండలాలు, గ్రామాలు ఏర్పాటు కావడం వంటి కారణాల వల్ల కొత్త జాబితాను సిద్ధం చేయాల్సిన అవసరం ఏర్పడింది.
- Advertisement -