Saturday, August 2, 2025
E-PAPER
Homeజాతీయంబీజేపీ కోసం ఈసీ ఓట్లు చోరీ చేస్తోంది: రాహుల్ గాంధీ

బీజేపీ కోసం ఈసీ ఓట్లు చోరీ చేస్తోంది: రాహుల్ గాంధీ

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: ఎన్నికల సంఘం ఓట్లను చోరీ చేస్తోందని ప్ర‌తిప‌క్ష‌నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. ఈసీ అక్రమాలపై తమ వద్ద పూర్తి ఆధారాలు ఉన్నాయని, ఓట్ల చోరీ అక్రమాలను చాలా తీవ్రంగా పరిగణిస్తున్నట్లు తెలిపారు. బీజేపీ కోసం ఈసీ ఓట్లు చోరీ చేస్తోందని ఆరోపించారు. మధ్యప్రదేశ్, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలతో పాటు లోక్‌సభ ఎన్నికల్లోనూ ఈసీ అక్రమాలకు పాల్పడిందని ఆరోపణలు చేశారు.

మధ్యప్రదేశ్, మహారాష్ట్రలో కొత్తగా కోటి ఓట్లను చేర్చారని అన్నారు. అందుకే ఈసీ అక్రమాలపై దాదాపు ఆరు నెలల పాటు దర్యాప్తు చేశాం.. ఈసీ అక్రమాలపై అణుబాంబు లాంటి ఆధారాలు తమ వద్ద ఉన్నాయి.. ఆ అనుబాంబులు పేలితే అసలు ఎన్నికల సంఘమే ఉండదని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల సంఘంలో అక్రమాలకు పాల్పడిన అధికారిది ఏ స్థాయి అయినా వదిలిపెట్టే ప్రసక్తే లేదని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఆ జాబితాలో ఇప్పటికే రిటైర్ అయిన వారున్నా చుక్కలు చూపిస్తామని కీలక ప్రకటన చేశారు.

మరోవైపు.. రాహుల్ ఆరోపణలకు ఈసీ స్పందించింది. అవన్నీ నిరాధారమైన ఆరోపణలు అని కొట్టిపారేసింది. రోజూ తమపై ఆరోపణలు అదే పనిగా కావాలని చేస్తున్నారు. అవన్నీ తాము పట్టించుకోబోము అని అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -