Tuesday, August 5, 2025
E-PAPER
Homeజాతీయంతొల‌గించిన ఓట‌ర్ల‌కు ఈసీ స‌మాధానం చెప్పాలి: తేజిస్వీ యాద‌వ్

తొల‌గించిన ఓట‌ర్ల‌కు ఈసీ స‌మాధానం చెప్పాలి: తేజిస్వీ యాద‌వ్

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: మ‌రోసారి ఎన్నిక‌ల సంఘంపై బీహార్ ఆర్జీడీ నేత తేజిస్వీ యాద‌వ్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు.
స్ఫెష‌ల్ రివిజ‌న్ పేరుతో చేప‌ట్టిన స‌మ‌గ్ర ఓట‌ర్ల జాబితా స‌వ‌ర‌ణ‌లో భాగంగా ప‌లువురిని తొల‌గించిన ప్ర‌జ‌ల‌కు ఈసీ స‌మాధానం చెప్పాల‌ని డిమాండ్ చేశారు. 50మందికిపైగా ఒకే అడ్ర‌స్‌తో కూడిన ఓట‌ర్ ఐడీ కార్డులు ఉన్నాయ‌ని, ఎన్నికల కమిషన్ ఇలాంటి అనేక వ్యత్యాసాలను కలిగి ఉంద‌ని, ఈ అంశంపై ఎన్నికల కమిషన్‌కు పంపి, కోర్టు ముందు తెలియ‌జేస్తామ‌ని అని వెల్ల‌డించారు.

అయితే ఇటీవ‌ల స‌వ‌రించిన ఓట్ల జాబితా ముసాయిదాను ఈసీ ప్ర‌చ‌రించిన విష‌యం తెలిసిందే. ఈక్ర‌మంలో స్థానికంగా ఉన్నా ప‌లువురి పేర్లు తొల‌గించ‌చ‌డ్డాయని ప్ర‌జ‌ల నుంచి తీవ్ర విమర్శ‌లు వ‌స్తున్నాయి. అంతేకాకుండా ఈసీ వెలువ‌రించిన ముసాయిదాలో త‌న పేరు కూడా గ‌ల్లంతైంద‌ని తేజిస్వీ యాద‌వ్ ఆరోపించారు. దీంతో మీడియా స‌మావేశంలో ఆయ‌న చూపించిన‌ EPIC(Photo Identity Cards) కార్డును స‌మ‌ర్పించాల‌ని ఈసీ.. తేజిస్వీ యాద‌వ్ కు నోటీసులు జారీ చేసింది. దీంతో ఈసీ ఇచ్చిన నోటీసుల‌కు స‌మాధానం ఇచ్చామ‌ని, త‌న‌కు అధికారికంగా EPIC కార్డును ఎన్నిక‌ల సంఘం అధికారులు అంద‌జేయ‌లేద‌ని పేర్కొన్న‌ట్లు తెలిపారు.

తేజస్వి యాదవ్ రెండు ఎలక్టోరల్ ఫోటో గుర్తింపు కార్డులు (EPICలు) కలిగి ఉన్నారని ఆరోపిస్తూ పాట్నాలోని దిఘా పోలీస్ స్టేషన్‌లో ఆయనపై ఫిర్యాదు నమోదైంది. తగిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని న్యాయవాది రాజీవ్ రంజన్ ఈ ఫిర్యాదును సమర్పించారు. దీంతో లాయ‌ర్ తో క‌లిసి ఆయ‌న పీఎస్‌కు వ‌చ్చి వెళ్లారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -