– ఆర్‌ఎస్‌ఎస్ ఎజెండా అమలు
– ఎన్నికల కమిషనర్ల నియామక ప్రక్రియ పాత పద్ధతిలోనే జరగాలి
– పేపర్ బ్యాలెట్‌కు తిరిగి రావాలి
– సర్‌పై చర్చలో ప్రతిపక్షాలు
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీసేందుకే కేంద్రం ఈసీని వాడుకుంటోందని, క్షేత్రస్థాయిలో ఎన్నికల సంస్కరణలు అమలు కావడం లేదని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ విమర్శించారు. రాజ్యాంగ వ్యవస్థలను చేతుల్లోకి తీసుకోవడమే రాష్ట్రీయ స్వయంసేవక్ సంఫ్‌ు (ఆర్‌ఎస్‌ఎస్) ఎజెండా అని, ఆ ఎజెండానే ఎన్డీఏ ప్రభుత్వం అమలు చేస్తోందని ధ్వజమెత్తారు. మంగళ వారం లోక్‌సభలో ఎన్నికల సంస్కరణలు, సర్‌పై జరిగిన చర్చలో రాహుల్ గాంధీ మాట్లాడారు. ఆర్‌ఎస్‌ఎస్ వాదులకు సమానత్వంపై నమ్మకం లేదని, అన్ని వ్యవస్థలపైనా ఆధిపత్యం చూపుతున్నారని విమర్శించారు. ఎన్నికల వ్యవస్థను సైతం ఆర్‌ఎస్‌ఎస్ తన గుప్పెట్లో ఉంచుకుందని ఆరోపించారు. ఇప్పటికే దేశంలోని విద్యా వ్యవస్థను మార్చేశారని, దేశంలోని వైవిధ్యాన్ని నాశనం చేస్తున్నారని అన్నారు. ఆర్‌ఎస్‌ఎస్ వ్యతిరే కులను ప్రభుత్వం టార్గెట్ చేస్తోందని ఆరో పించారు. ఎన్నికల కమిషనర్లకు మోడీ, అమిత్ షా బహుమతులిస్తు న్నారని, సీబీఐ, ఈడీలను ప్రభుత్వం తన గుప్పిట్లో ఉంచు కుందని ఆరోపణలు గుప్పించారు. కేంద్రం, ఎన్నికల సంఘం కుమ్మక్కయ్యా యని, తాను నిజాలు మాట్లాడుతుంటే బీజేపీ జీర్ణించుకోలేక పోతోందని అన్నారు. తాను ఏదీ తప్పుగా మాట్లాడలేదని, పూర్తి ఆధారాలతోనే మాట్లాడుతున్నానని చెప్పారు. ఎన్నికల సంస్కరణలపై కేంద్రం గొప్పలు చెప్పుకుంటోదని రాహుల్ విమర్శించారు. ఉత్తర ప్రదేశ్, హర్యానాలో పలు చోట్ల ‘ఓట్ చోరీ’ జరిగిందన్నారు. ఎన్నికల అధికారులు ఫుటేజ్‌ను ధ్వంసం చేశారని, ఫేక్ ఓట్లపై ఈసీ స్పష్టత ఇవ్వలేదని తెలిపారు. తాను అడిగిన ప్రశ్నలకు ఇప్పటికీ ఈసీ సమాధానం ఇవ్వలేదన్నారు.
వందేమాతరం గేయానికి ఎంతో ఔన్నత్యం ఉంది: రాజ్యసభలో అమిత్ షా
దేశ ప్రజల్లో వందేమాతరం ఎప్పటికీ స్పూర్తి నింపుతూనే ఉందని కేంద్ర హౌం మంత్రి అమిత్ షా అన్నారు. జాతీయగీతం ‘వందేమాతరం’ 150 ఏండ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా మంగళవారం రాజ్యసభలో చర్చ జరిగింది. వందేమాతర గేయాని కి గతంలోనూ ఎంతో ఔన్నత్యం ఉందని, 2047 లోనూ ఉంటుందని అన్నారు. వందేమా తరం గీతాన్ని రచించిన బంకిమ్ ఛటర్జీ బెంగాల్‌లో పుట్టడం నిజమని, కానీ వందేమాతర గేయం బెంగాల్‌కో, ఇండియాకో మాత్రమే పరిమితమైనది కాదని అన్నారు. దేశ స్వాతంత్య్రం కోసం పోరాడిన భారతీయ వీరులు ప్రపంచంలో అజ్ఞాతంగా ఎక్కడ కలిసినా వందేమాతరం అని నినదించేవారని తెలిపారు. నేటికీ మన సరిహద్దుల్లో దేశ అంతర్గత భద్రత కోసం ప్రాణత్యాగాలు చేస్తున్న మన బలగాల నోట నిరంతరం వందేమాతరం మారుమ్రోగు తోందని అన్నారు. తరతరాలకు వందే మాతరం స్ఫూర్తినిస్తోందని, వందేమాతర గీతంపై ఉభయ సభల్లోనూ చర్చ జరపడం వల్ల భవిష్యత్ తరాల వారూ మన జాతీయగీతం ప్రాధాన్యత, కీర్తిని తెలుసుకునే అవకాశం కలుగుతుందని చెప్పారు.
ప్రభుత్వ ఏర్పాటులో శ్యామ్ ప్రసాద్‌కు దేశభక్తి ఎక్కడుంది? :రాజ్యసభలో ప్రతిపక్ష నేత ఖర్గే
జిన్నా ఒత్తిడితో జవహర్‌లాల్ నెహ్రూ వందేమాతరంపై రాజీ పడ్డారని ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యకు రాజ్యసభ ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే సవాల్ చేశారు. ”శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ ముస్లిం లీగ్‌తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పుడు బీజేపీ దేశభక్తి ఎక్కడ ఉంది?” అని ఖర్గే ప్రశ్నించారు. బీజేపీ విదేశాంగ విధానాన్ని విమర్శించారు. యూఎస్ డాలర్‌తో పోలిస్తే భారత రూపాయి పతనంపై ఆందోళనలను లేవనెత్తారు. దీనితో అధికార పార్టీ ఎంపీల నుంచి నిరసనలు వ్యక్త మయ్యాయి. తన ప్రసంగాన్ని ”వందే మాతరం” జపిస్తూ ప్రారంభించారు. ఇది చాలా కాలంగా తనకు అలవాటుగా ఉందని, ట్రెజరీ బెంచ్‌లోని కొందరు అలా చేయడం ప్రారంభించారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ చారిత్రాత్మకంగా వందేమాతరంను ఒక నినాదంగా మార్చుకుందని, దానితో పార్టీ కార్యక్రమాలను ప్రారంభిం చిందని, అదే సంప్రదా యాన్ని అనుసరించాలని అన్నారు. ఆప్ ఎంపీ సంజరు సింగ్ మాట్లాడు తూ వందేమా తరం పాడినం దుకు జైలు శిక్ష అనుభవించిన ఆర్‌ఎస్‌ఎస్ నుంచి కనీసం నలుగురు పేర్లు చెప్పాలని అన్నారు. భారత స్వాతంత్య్ర పోరాటంలో ఆర్‌ఎస్‌ఎస్‌కి చరిత్ర లేనందున వారి పేర్లు చెప్పలేనని తెలిపారు.
కేంద్రం చేతిలో ఈసీ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



