‘124 ఏండ్ల’ మింతా దేవీ
పాట్నా : ఇటీవల ‘ఓట్ల చోరీ’పై ఇచ్చిన ప్రజెంటేషన్‌లో రాహుల్‌గాంధీ ప్రస్తావించారు. ఈ పరిణామాలతో వార్తల్లో నిలిచిన మింతా దేవీ.. 35 ఏండ్లకే ఎన్నికల సంఘం తనను బామ్మని చేసేసిందంటూ సరదాగా వ్యాఖ్యానించారు. ”ఎట్టకేలకు 35 ఏండ్ల వయసులో మొదటిసారి ఓటు వేసే అవకాశం లభించడం ఆనం దంగా ఉంది. గతంలోనూ ఓటరుగా నమోదయ్యేం దుకు ప్రయత్నాలు చేసినప్పటికీ.. నిరాశే ఎదురైంది. బూత్ స్థాయి అధికారి కోసం ఎదురుచూసినా ఫలితం లేకపోవడంతో.. ఆన్‌లైన్‌లో దరఖాస్తు నింపాను. ఈ ప్రక్రియలో భాగంగా ఇప్పుడు ఎన్నికల సంఘం నన్ను బామ్మని చేసినా.. అందులో భయపడాల్సిందేమీ లేదు. ఈ పొరపాటుకు నేనెలా బాధ్యురాలిని అవుతాను? ఆధార్ కార్డులో ఉన్నట్లుగానే 1990లో పుట్టినట్టు పేర్కొన్నాను. కానీ, ముసాయిదా జాబితాలో 1990 బదులు 1900 అని ఉంటే నేనేం చేయలేను” అని బీహార్‌లోని సివాన్ జిల్లా దరౌందా నియోజకవర్గానికి చెందిన మింతాదేవీ అన్నారు.
ఈసీ నన్ను బామ్మని చేసింది..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES