Wednesday, December 17, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్చేపల పెంపకంతో మత్స్యకారులుకు ఆర్థికంగా అభివృద్ధి..

చేపల పెంపకంతో మత్స్యకారులుకు ఆర్థికంగా అభివృద్ధి..

- Advertisement -

నవతెలంగాణ – వెల్దండ
చేపల పెంపకంతో మత్స్యకారులకు ఆర్థిక అభివృద్ధి జరుగుతుందని వెల్దండ మండల కేంద్ర సర్పంచ్ మట్ట యాదమ్మ వెంకటయ్య గౌడ్, మస్య కార సొసైటీ జిల్లా డైరెక్టర్ కాసారపు వెంకటయ్య అన్నారు. బుధవారం వెల్దండ మండల కేంద్ర పరిధిలోని కొండకత్వ చెరువులో మత్స్యశాఖ ద్వారా అందిన 50వేల చేప పిల్లలను గ్రామం మస్త్యకార సంఘం ఆధ్వర్యంలో చెరువులో వదిలారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం ముదిరాజులను ఆర్థికంగా బలోపేతం చేసే దిశగా మత్సకారులకు చేప పిల్లలను పంపిణీ చేస్తుందన్నారు.  ఈ కార్యక్రమంలో మత్స్యకార సొసైటీ ఉపాధ్యక్షుడు అన్నెపు వెంకటేష్,మండల ముదిరాజ్ అధ్యక్షులు బాదేపల్లి మల్లయ్య , గ్రామ ఉపసర్పంచ్ బస్నమోని శ్రీనివాస్, వార్డు సభ్యులు వాణి పురుషోత్తం, కిష్టల్, బయ్య మల్లయ్య, మట్ట నిరంజన్, రషీద్, భరత్, శ్రీనివాస్, నిరంజన్, శివ, బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -