నవతెలంగాణ-హైదరాబాద్: కేంద్ర ఎన్నికల సంఘం సమగ్ర ఓటర్ జాబితా సవరణ(ఎస్ఐఆర్)కు సన్నాహాలు ముమ్మరం చేస్తుంది. ఇప్పటికే బీహార్ రాష్ట్రంలో ఎస్ఐఆర్ ప్రక్రియను పూర్తి చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రత్యేక ఓటర్ జాబితా ప్రక్రియను దేశవ్యాప్తంగా నిర్వహించాలని ఈసీ కసరత్తు చేస్తోంది. ఈక్రమంలోని పలు రాష్ట్రాల ఎన్నికల ప్రధాన కమిషన్లతో సమావేశాలు నిర్వహిస్తుంది ఈసీ. తాజాగా ఆగష్టు 20న కేరళ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ తోపాటు రాజకీయ పార్టీలతో కేంద్ర ఎన్నికల సంఘం కీలక భేటీ నిర్వహించనుంది. ఈ సమావేశంలో ఎస్ఐఆర్ ప్రక్రియపై ఆయా పార్టీలతో చర్చిస్తామని కేరళ ఎన్నికల కమిషనర్ రతన్ యు కేల్కర్ తెలిపారు. ఏ క్షణ్ణంలోనైనా రాష్ట్రంలో SIR ప్రక్రియ మొదలుకావోచ్చు అని, అందుకు సంసిద్ధంగా ఉన్నామని జాతీయా మీడియాకు తెలిపారు.
మరోవైపు బీహార్ తరహా SIRను తమ రాష్ట్రాల్లో నిర్వహించడానికి వీలులేదని పలు రాష్ట్రాలు స్పష్టం చేశాయి. బీహార్ SIRను ఇప్పటికే విపక్షాలు ముక్తకంఠంతో వ్యతిరేకించాయి. అయిన కానీ ఈసీ ముందుకెళ్తుందని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. అదే విధంగా ఓట్ చోరీ అనే కార్యక్రమంలో కేంద్ర ఎన్నికల సంఘంపై ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ దుమ్మెత్తిపోస్తున్నారు. బీజేపీ తో ఈసీ ఓట్ల చోరీకి పాల్పడుతుందని బీహార్ లోని చంపారన్ వేదికగా చేపట్టిన ఓటర్ అధికార్ యాత్రలో ఆరోపించిన విషయం తెలిసిందే. అంతేకాకుండా ఈసీ ఎస్ఐఆర్ ప్రక్రియపై విపక్షాలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. ఆధార్ కార్డును గుర్తుంపు పత్రంగా ఈసీ పరిగణనలోకి తీసుకోకపోవడంపై సర్వోన్నత న్యాయస్థానం అభ్యంతరం తెలిపింది. బీహార్‌లో సరైనా కారణాలు చెప్పకుండా లక్షల్లో ఓట్లను తొలగించారని విపక్షాలు మండిపడుతున్నాయి.