– సహకార బ్యాంకు రుణాల గోల్‌మాల్
– కాంగ్రెస్ మాజీ ఎంపీపై మనీలాండరింగ్ ఆరోపణలు
పోర్ట్‌బ్లెయిర్: ఓ మనీలాం డరింగ్ కేసు దర్యాప్తులో భాగంగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు అండమాన్ నికోబార్ దీవుల్లో సోదాలు నిర్వహించారు. ఈ దీవుల్లో ఈడీ తనిఖీలు చేపట్టడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం. ఓ సహకార బ్యాంకు రుణాల వ్యవహారంలో అవకతవకలకు పాల్పడినట్టు స్థానిక కాంగ్రెస్ మాజీ ఎంపీ కుల్దీప్‌రారు శర్మ తదితరులపై ఆరోపణలు ఉన్నాయి. దీనికి సంబంధించిన మనీలాండరింగ్ కేసు దర్యాప్తులో భాగంగా ఈడీ అధికారులు పోర్ట్ బ్లెయిర్ పరిసరాల్లోని తొమ్మిది ప్రాంతాల్లో దాడులు నిర్వహించారు. కోల్‌కతాలోనూ తనిఖీలు కొనసాగాయి.
కేసు నేపథ్యమిది..
అండమాన్ నికోబార్ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంకు (ఏఎన్‌ఎస్‌సీబీ) ద్వారా రుణాలు, ఓవర్‌డ్రాఫ్ట్ మంజూరులో పెద్దఎత్తున అవకతవకలు జరిగినట్టు ఆరోపణలున్నాయి. కొందరు 15 షెల్ సంస్థలను సృష్టించి.. బ్యాంకు నుంచి రూ.200 కోట్లకుపైగా రుణాలను మోసపూరితంగా తీసుకున్నారని అధికారులు వెల్లడించారు. ఈ రుణాల్లో చాలావరకు నగదు రూపంలో ఉపసంహరించుకుని.. గతంలో బ్యాంకు వైస్ చైర్మెన్‌గా పనిచేసిన కుల్దీప్‌రారు శర్మకు, ఇతరులకు ముట్టజెప్పినట్టు పేర్కొన్నారు.
ఈ వ్యవహారంపై కేసు నమోదు చేసిన పోలీసులు.. ఈ నెల 18న శర్మను అరెస్టు చేశారు. ఈ నెల 29న కోర్టు ఆయన్ను మూడు రోజుల పోలీసు కస్టడీకి పంపింది.
అండమాన్ నికోబార్‌లో తొలిసారి ‘ఈడీ’ సోదాలు
- Advertisement -
- Advertisement -