Monday, December 1, 2025
E-PAPER
Homeజాతీయంకేరళ సీఎంకు ఈడీ నోటీసులు..ఎన్నికల స్టంట్‌లో భాగమే

కేరళ సీఎంకు ఈడీ నోటీసులు..ఎన్నికల స్టంట్‌లో భాగమే

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : కేరళ రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తూ.. KIIFB మసాలా బాండ్ వ్యవహారానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ముఖ్యమంత్రి పినరయి విజయన్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ షోకాజ్ నోటీసు జారీ చేసింది. ఈడీ వర్గాల సమాచారం ప్రకారం.. శనివారం జారీ చేసిన ఈ నోటీసులో ఫారిన్ ఎక్స్ఛేంజ్ మేనేజ్‌మెంట్ యాక్ట్ (FEMA), రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) నిబంధనలను ఉల్లంఘించినట్లు ఆరోపణలు ఉన్నాయి. మాజీ ఆర్థిక మంత్రి థామస్ ఐజాక్, కేఐఐఎఫ్‌బీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కేఎమ్ అబ్రహాం కూడా ఈ నోటీసులు అందుకున్నారు.
ఎన్నికల స్టంట్‌లో భాగంగానే ఈ నోటీసులు
ఈడీ నోటీసు అందినట్లు మాజీ ఆర్థిక మంత్రి థామస్ ఐజాక్ కూడా ధృవీకరించారు. అయితే ఈ ఆరోపణలను ఆయన తీవ్రంగా ఖండించారు. “ఇదంతా అనవసరం. మేము భూమి కొనుగోలు కోసం ఆ నిధులను ఎప్పుడూ ఉపయోగించలేదు. కేఐఐఎఫ్‌బీ ప్రాజెక్టుల కోసం భూసేకరణ నిబంధనల ప్రకారమే జరిగింది. ఈ ఈడీ నోటీసు ఎన్నికల స్టంట్‌లో భాగమే” అని ఐజాక్ అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -