Friday, July 4, 2025
E-PAPER
Homeజాతీయంజార్ఖండ్‌ కాంగ్రెస్‌ మాజీ మంత్రి ఇంట్లో ఈడీ సోదాలు

జార్ఖండ్‌ కాంగ్రెస్‌ మాజీ మంత్రి ఇంట్లో ఈడీ సోదాలు

- Advertisement -


న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: జార్ఖండ్‌ కాంగ్రెస్‌ మాజీ మంత్రి యోగేంద్ర సావో ఇంటిపై శుక్రవారం ఈడీ (ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌) దాడులు నిర్వహిస్తోంది. అక్రమ ఇసుక మైనింగింగ్‌, మనీలాండరింగ్‌ కేసులో యోగేంద్ర సావో, అతని కుటుంబ సభ్యుల ఇళ్లలోనూ శుక్రవారం ఉదయం నుంచి సోదాలు నిర్వహిస్తున్నట్లు ఈడీ అధికారులు వెల్లడించారు. మనీలాండరింగ్‌ కేసు దర్యాప్తులో భాగంగా హజారీబాగ్‌, రాంచీలలో కనీసం ఎనిమిది ప్రదేశాల్లో ఈడీ దాడులు నిర్వహించింది. ఇసుక అక్రమైనింగ్‌కి పాల్పడి గణనీయమైన స్థాయిలో డబ్బులు సంపాదించారనే ఆరోపణలకు సంబంధించి కేసు దర్యాప్తులో భాగంగా ఈడీ దాడులు నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

కాగా, కాంగ్రెస్‌ నేత యోగేంద్ర సావో గతంలో వ్యవసాయ శాఖా మంత్రిగా పనిచేశారు. ఆయన ఎమ్మెల్యే కుమార్తె అంబా ప్రసాద్‌పై దర్యాప్తు జరుగుతున్న మనీలాండరింగ్‌ కేసులో గత సంవత్సరం ఈడీ ఆయనను ప్రశ్నించింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -