నవతెలంగాణ – హైదరాబాద్: టీమిండియా మాజీ ఓపెనర్ శిఖర్ ధావన్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సమన్లు జారీ చేసింది. అక్రమ బెట్టింగ్ యాప్‌తో ముడిపడి ఉన్న మనీ లాండరింగ్ కేసులో విచారణ కోసం గురువారం తమ ఎదుట హాజరు కావాలని ఆదేశించింది. అధికార వర్గాల కథనం ప్రకారం, ‘1xBet’ అనే అక్రమ బెట్టింగ్ యాప్‌కు సంబంధించిన కేసులో ఈ విచారణ జరుగుతోంది. మనీ లాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్‌ఏ) కింద 39 ఏళ్ల ధావన్ వాంగ్మూలాన్ని ఈడీ అధికారులు నమోదు చేయనున్నారు. ఈ బెట్టింగ్ యాప్‌కు సంబంధించిన కొన్ని ప్రచార కార్యక్రమాల్లో ధావన్ పాల్గొన్నట్టు ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో, సదరు యాప్‌తో ఆయనకు ఉన్న సంబంధాలు, ఆర్థిక లావాదేవీలపై స్పష్టత కోసమే ఈడీ ఆయన్ను ప్రశ్నించాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఇలాంటి అక్రమ బెట్టింగ్ యాప్‌ల ద్వారా ప్రజల నుంచి కోట్లాది రూపాయలు కొల్లగొట్టడం, పన్నులు ఎగవేయడం వంటి పలు కేసులపై ఈడీ దేశవ్యాప్తంగా దర్యాప్తును ముమ్మరం చేసింది. ఇందులో భాగంగానే గత నెలలో మరో మాజీ క్రికెటర్ సురేశ్ రైనాను కూడా ఈడీ అధికారులు ప్రశ్నించిన విషయం తెలిసిందే. ఇప్పుడు శిఖర్ ధావన్‌ను కూడా విచారణకు పిలవడం ఈ కేసులో కీలక పరిణామంగా మారింది.
శిఖర్ ధవన్‌కు ఈడీ సమన్లు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES