Saturday, March 14, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్నేషనల్ హ్యాండ్ బాల్ గేమ్ కు ఎడ్లపల్లి యువకుడు ఎంపిక

నేషనల్ హ్యాండ్ బాల్ గేమ్ కు ఎడ్లపల్లి యువకుడు ఎంపిక

- Advertisement -

ప్రోత్సహించి,ఆర్థిక సాయం అందించిన మంత్రి శ్రీధర్ బాబు, సర్పంచ్ శ్రీనివాస్ కు కృతజ్ఞతలు
నవతెలంగాణ – మల్హర్ రావు

మండలంలోని ఎడ్లపల్లి గ్రామానికి విజయగిరి సమ్మయ్య-లక్ష్మీ దంపతుల ద్వితీయ పుత్రుడు విజయగిరి సాయికృష్ణ నేషనల్ అసోసియేషన్ హ్యాండ్ బాల్ గేమ్ ఆడేందుకు ఎంపికైయ్యాడు.సాయికృష్ణ జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్ లో ఏడవ తరగతి నుండి ఇంటర్ సెకండ్ ఇయర్ వరకు చదివి,ప్రస్తుతం వరంగల్ ఎల్బీ కాలేజీలో డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. తెలంగాణ అకాడమీ గురుకుల  అకాడమీ హ్యాండ్ బాల్   కోచ్ ప్రవీణ్ కుమార్  శిక్షణతో జిల్లా స్థాయి నుండి ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయిలో ప్రతిభ కనబరిచి, నేషనల్ గేమ్స్ హర్యానాలో ఆడారు.

తర్వాత గత సంవత్సరం తెలంగాణ యూనివర్సిటీ తరపున తమిళనాడులో నేషనల్ గేమ్స్ ఆడారు. ఇప్పుడు వరుసగా రెండోసారి తెలంగాణ యూనివర్సిటీ తరఫున తమిళనాడులో విట్ వెళ్ళొరి యూనివర్సిటీలో ఈ నెల 17 నుంచి 21 వరకు జరిగే నేషనల్ గేమ్ లో పాల్గొన్నన్నారని తల్లిదండ్రులు తెలిపారు. జాతీయ స్థాయిలో ఆడేందుకు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ప్రోత్సాహంతో ఎడ్లపల్లి గ్రామ సర్పంచ్ జంగిడి శ్రీనివాస్ ఆర్థిక సాయ సహకారం అందించారని వారికి, కాకతీయ యూనివర్సిటీ నేషనల్ హ్యాండ్ బాల్ యూనియన్ క్రీడా కోచ్ లకు సాయికృష్ణ తల్లిదండ్రులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -