యుఎస్పిసి యాదాద్రి జిల్లా కమిటీ…
నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
విద్యారంగ, ఉపాధ్యాయ సమస్యల పరిష్కారం కోసం మంగళవారం జిల్లా కలెక్టరేట్ వద్ద ధర్నా చౌక్ లో ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ (యూఎస్ పీసీ) ఆధ్వర్యంలో దశలు వారి పోరాటాల్లో బాగంగా ముక్కెర్ల యాదయ్య, టి వీరభద్రం, జి లక్ష్మీనరసింహారెడ్డి అధ్యక్ష వర్గంగా ధర్నా నిర్వహించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని, బదిలీలు, పదోన్నతుల ప్రక్రియను వెంటనే పూర్తిచేయాలని, 5571 పిఎస్ హెచ్ఎం పోస్టులు మంజూరు చేయాలి.
పీఆర్సీని ప్రకటించి 1/7/2023 నుండి అమలు చేయాలన్నారు. పెండింగ్ డీఏ లను వెంటనే చెల్లించాలని, సీ పీఎస్ ను రద్దుచేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని, 317 జీ ఓ వల్ల నష్టపోయిన ఉపాధ్యాయులందరినీ వారి సొంత జిల్లాలకు పంపించాలని, ఉద్యోగ విరమణ పొందిన ఉపాధ్యాయులందరికీ పెండింగ్ బకాయిలను వెంటనే చెల్లించాలని, ఉపాధ్యాయుల సర్దుబాటు జీఓ 25 ను సవరించాలని కోరారు.
సమగ్ర శిక్ష ఉద్యోగుల 29 రోజుల సమ్మె కాలపు జీతాన్ని వెంటనే చెల్లించాలనీ, టైం స్కేల్ ఇవ్వాలని, వివిధ గురుకులాల్లో విధులు నిర్వహిస్తున్న గెస్ట్, పార్ట్ టైం అవుట్ సోర్సింగ్ ఉపాధ్యాయులకు కనీస వేతనం ఇవ్వాలని, నూతన జిల్లాలకు డీఈఓ పోస్టులను, ప్రతి రెవెన్యూ డివిజన్ కు డిప్యూటీ ఈఓ, నూతన మండలాలకు ఎంఈఓ పోస్టులను మంజూరు చేసి, ఉపాధ్యాయుల ఏకీకృత సర్వీసు రూల్స్ రూపొందించి, ఖాళీ పోస్టులను వెంటనే భర్తీ చేయలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించ నట్లైతే ఆగష్టు 23 న హైదరాబాద్ లో రాష్ట్ర స్థాయి మహా ధర్నా నిర్వహిస్తామని తెలిపారు.
ధర్నా అనంతరం జిల్లా కలెక్టర్ కు వినతిపత్రం అందజేశారు. ఈ సమావేశంలో జిల్లా స్టీరింగ్ కమిటీ నాయకులు మెతుకు సైదులు, మైలారం సత్తయ్య, ఎస్ భాస్కర్, సి హెచ్ లక్ష్మి, ఎ వెంకటా చారి, శ్రీనివాసు, పొన్నాల సత్తయ్య, బి లింగయ్య, కె రాజగోపాల్, వెంకట్ రెడ్డి, జి లింగయ్య , సైదా రెడ్డి, ఎన్ వెంకటేశ్వర్లు, జనార్ధన్, బిక్షపతి,దశరథ, కె వెంకన్న లు పాల్గొన్నారు.