Saturday, October 25, 2025
E-PAPER
Homeఖమ్మంఎక్సలెంట్ పాఠశాలలకు ఎడ్యుకేషన్ అవార్డు 2025..

ఎక్సలెంట్ పాఠశాలలకు ఎడ్యుకేషన్ అవార్డు 2025..

- Advertisement -

హర్షం వ్యక్తం చేసిన యాజమాన్యం..
కృషి, అంకితభావం, సహకారంతో ముందడుగు..
ఎక్సలెంట్ విద్య సంస్థల చైర్మన్ యూసఫ్ షరీఫ్..
నవతెలంగాణ – మణుగూరు

ఎక్సలెంట్ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ కు ఎడ్యుకేషన్ అవార్డు 2025 లభించినందుకు గర్వంగా, సంతోషంగా ఉన్నదని ఎక్సలెంట్ విద్యాసంస్థల చైర్మన్ ఎండి యూసఫ్ షరీఫ్ తెలియజేశారు. ఎక్సలెంట్ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ కు ఎడ్యుకేషన్ అవార్డు 2025 అనే ప్రతిష్టాత్మక జాతీయ అవార్డు లభించింది అన్నారు ఈ అవార్డు కార్యక్రమం మల్లా బ్యూరో ఆఫ్ చైల్డ్ డెవలప్మెంట్ ఆధ్వర్యంలో స్కూల్ ఆఫ్ వండర్ కిడ్స్ విశాఖపట్నం, నేషనల్ ఇండిపెండెన్స్ స్కూల్ అసోసియేషన్ (ఎన్ఐఎస్ఎ), ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ అన్ఏయిడెడ్ స్కూల్ మేనేజ్మెంట్ అసోసియేషన్ ఏ పి పి యు ఎస్ ఎం ఏ మరియు తెలంగాణ రికగ్నైజ్డ్ స్కూల్ మేనేజ్ మెంట్ అసోసియేషన్ టి ఆర్ ఎస్ ఎం ఏ సంయుక్తంగా ఈ అవార్డును అందజేశారని తెలిపారు.

అక్టోబర్ 23, 2025న విశాఖపట్నంలోని ఫెయిర్ఫోల్డ్ మారియట్ హెూటల్లో నిర్వహించిన కార్యక్రమాల్లో అందజేశారన్నారు ఈ పురస్కారం ఏజెన్సీ ప్రాంతం లోని విద్యారంగంలో చేసిన అసాధారణ సేవలు, విద్యార్థుల అభివృద్ధికి చేసిన కృషి, మరియు నాణ్యమైన విద్యను అందించాలనే నిరంతర ప్రయత్నానికి ఈ అవార్డు లభించిందని చైర్మన్  యూసఫ్ షరీఫ్ కి ఆయన తెలిపారు. కార్యక్రమాన్ని  మల్లా రామనాయుడు  నిర్వహించారు. ఈ అవార్డును ప్రధాన అతిథిగా విచ్చేసిన విశాఖపట్నం ఎంపీ  ఎం. శ్రీభరత్  అందజేశారు.

ఈ సందర్భంలో ప్రముఖులు ఎన్ఐఎస్ ఏ అధ్యక్షుడు కులభూషణ్ శర్మ, మాజీ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శి ఎ. కృష్ణారెడ్డి , అధ్యక్షులు కె. తులసి విష్ణు ప్రసాద్,  టిఆర్ఎస్ ఎం ఏ అధ్యక్షులు ఎస్. మధుసూదన్, మరియు బ్రహ్మం వి. కాకాని  సీఈఓ, బ్రెయిన్ ఫీడ్ ఎడ్యుకేషనల్ మాగజైన్ పాల్గొన్నారు.ఈ ఘనత సాధించడానికి తమ కృషి, అంకితభావం మరియు సహకారం అందించిన మా విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు మరియు పాఠశాల ఉపాధ్యాయేతర బృందానికి మా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మనమందరం కలిసి ఇలాగే కృషి చేస్తూ, విద్యారంగంలో మరిన్ని ఉన్నత శిఖరాలను అందుకోవాలని, పాఠశాల కరెస్పాండంట్ ఖాదర్ షరీఫ్ , యాకుబ్ షరీఫ్  మరియు ఉపాధ్యాయులు కోరుకుంటున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -