Monday, August 11, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్పాఠశాల యజమానులకు విద్యాశాఖ హెచ్చరిక.. 

పాఠశాల యజమానులకు విద్యాశాఖ హెచ్చరిక.. 

- Advertisement -

నవతెలంగాణ – భువనగిరి : జిల్లాలో విద్యాశాఖ అనుమతి తీసుకొని గుర్తింపు పొంది నిర్వహించబడుతున్న ప్రయివేట్ పాఠశాల నిర్వాహకులు ప్రభుత్వం పరిధిలకు లోబడి పాఠశాల నిర్వహణ చేయాలని మంగళవారం హెచ్చరికలు జారీ చేసింది.

నిబంధనలు:

పాఠశాల పేరుకు ముందు/ వెనుక వలంపియాడ్ , టెక్నో, జేఈఈ, ఐఐటి, పబ్లిక్, కోచింగ్, స్పెషల్ క్లాసులు అని, ఇతరములు నమోదు చేయకూడదు. ఆ విధముగా నమోదు చేయించి విద్యార్థులను, తల్లిదండ్రులను ఇబ్బందులకు గురి చేయకూడదు.  పాఠశాల నిర్వహణ పూర్తిగా ప్రభుత్వ నియమ నిబంధనలు, అకాడమిక్ క్యాలెండర్ మేరకు లోబడి నిర్వహించబలెను. కరపత్రములను పంచకూడదు. జిల్లా కామన్ బోర్డు వారి నియమ నిబంధనలను పాటించవలెను. వారిచే జారీ చేయబడిన ప్రశ్న పత్రములతో మాత్రమే పరీక్షలు నిర్వహించవలెను.  విద్యార్థుల రవాణాకు ఉపయోగించే బస్సులకు సంబంధిత శాఖ వారిచే జారీ చేయబడిన ఫిట్నెస్ ధ్రువీకరణ పొందవలెను. అర్హత గల డ్రైవర్లను మాత్రమే నియమించవలెను. ప్రతి బస్సులో క్లీనర్/ఆయా తప్పనిసరిగా ఉండాలి. డ్రైవర్ సెల్ ఫోన్ మాట్లాడుతూ బస్సు నడపరాదు. 

పూర్తి అర్హత కలిగిన ఉపాధ్యాయులచే బోధన నిర్వహించవలెను.  ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారము మాత్రమే నిర్ణయించిన ఫీజులు వసూలు చేయవలెను.  ఉపాధ్యాయుల అర్హతతో కూడిన ఫోటో గుర్తింపు పేర్లతో లిస్టు, ఫీజుల వివరములు పాఠశాల నోటీసు బోర్డుపై ఉంచవలెను.  పాఠశాలలో పాఠ్య పుస్తకములు, నోట్ పుస్తకాలు, యూనిఫామ్, టై బెల్ట్, షూస్,  ఇతరములు విక్రయించరాదు. ఎట్టి పరిస్థితులలో కూడా విద్యార్థులను, తల్లిదండ్రులను ఇబ్బందులకు గురి చేయరాదు. ప్రభుత్వ అనుమతి పొందిన వారు గుర్తింపు కొరకు మరియు గుర్తింపు కాలము పూర్తయిన పాఠశాల వారు వెంటనే తదుపరి పొడిగింపు ఉత్తర్వుల కొరకు దరఖాస్తు చేయవలెను. భవన దారుఢ్య ధ్రువీకరణ పత్రము, ఫైర్ సేఫ్టీ లేటెస్ట్ సర్టిఫికెట్స్ తీసుకోవలెను. సానిటరీ, త్రాగునీరు వసతి కల్పించవలెను.  జిల్లా అధికారుల నుండి ఎప్పటికప్పుడు జారీ చేయబడు సూచనలు పాటించవలెను. వారంతపు సెలవులు, ఇతర పండుగల సెలవులలో విద్యార్థులకు ప్రత్యేక తరగతులు ఎట్టి పరిస్థితులలో నిర్వహించరాదు. అనుమతి ఉన్న మేరకు 1:40  నిష్పత్తిలో మాత్రమే తరగతి నిర్వహించాలి. అంతకుమించి విద్యార్థులను చేర్చుకున్న లేక అనుమతి లేని సెక్షన్లు ఉన్నచో పాఠశాల గుర్తింపు రద్దు చేయబడును.  కావున సంబంధిత పాఠశాలల యాజమాన్యం వారు ప్రభుత్వ  నియమ నిబంధనలు పాటించి పైన తెలిపిన అంశములలో విద్యార్థులు మరియు తల్లిదండ్రులు ఆందోళన చెందేలా కాకుండా పాఠశాల సుహృద్భావ వాతావరణంలో నిర్వహించుటకు ఆదేశించారు. 

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img